Sunday, September 8, 2024

IFFIలో తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ధూత’ ను ప్రదర్శించిన ప్రైమ్ వీడియో

- Advertisement -

54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ధూత’ ను ప్రదర్శించిన ప్రైమ్ వీడియో

హీరో నాగ చైతన్య అక్కినేని, పార్వతి తిరువోతు, నిర్మాత శరత్ మరార్, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ హాజరైన ఈ సిరీస్ ప్రీమియర్ ప్యాక్డ్ హౌస్‌తో ప్రారంభమై, ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లోని ప్రైమ్ మెంబర్స్ కు డిసెంబర్ 1 నుంచి  ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో సిరీస్‌లోని మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ప్రసారం కానున్నాయి.

భారతదేశంలో అందరూ ఇష్టపడే ఎంటర్ టైన్మెంట్ డెస్టినేషన్  ప్రైమ్ వీడియో, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ఒరిజినల్ సూపర్‌నేచురల్ సస్పెన్స్-థ్రిల్లర్ ‘దూత’ ను ప్రస్తుతం జరుగుతున్న54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శించింది. ప్రీమియర్‌కు సిరీస్‌లోని ప్రధాన తారాగణం నాగ చైతన్య అక్కినేని, పార్వతి తిరువోతు, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాత శరత్ మరార్, దర్శకుడు విక్రమ్ కె. కుమార్, కంట్రీ డైరెక్టర్, ప్రైమ్ వీడియో సుశాంత్ శ్రీరామ్ హాజరయ్యారు. వీరితో పాటు శ్రీ పృథుల్ కుమార్, డైరెక్టర్ – IFFI, MD, NFDC లిమిటెడ్, జాయింట్ సెక్రటరీ (ఫిలిమ్స్),  సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా వైస్ చైర్మన్ శ్రీమతి. డెలిలా ఎం. లోబో ఈ ప్రిమియర్ కి హాజరయ్యారు.

Prime video of Telugu original series 'Dhoota' premiered at IFFI
Prime video of Telugu original series ‘Dhoota’ premiered at IFFI

ఈ సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ప్రియా భవాని శంకర్,  ప్రాచీ దేశాయ్ కీలక పాత్రల్లో నటించారు. ధూత నాగ చైతన్య అక్కినేని, పార్వతి తిరువోతు(తెలుగు) డెబ్యు సిరిస్. ఈ సిరీస్ భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా 240 కంటే ఎక్కువ దేశాలలో ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 1న నుంచి ప్రసారం కానుంది.

“ధూతను IFFI వంటి ప్రతిష్టాత్మకమైన వేదికపైకి తీసుకురావడం మాకు గౌరవం, గర్వంగా ఉంది. ప్రైమ్ వీడియోలో ప్రతి ఒక్క కస్టమర్‌ను అలరించడమే మా ప్రధాన లక్ష్యం. కాబట్టి, ఇది తెలుగు లాంగ్-ఫార్మాట్ కంటెంట్ స్పేస్‌లోకి ప్రవేశించడానికి సరైన సిరిస్ అని మాకు తెలుసు” అని ప్రైమ్ వీడియో, ఇండియా కంట్రీ డైరెక్టర్ సుశాంత్ శ్రీరామ్ అన్నారు. “ఈ సూపర్ నాచురల్  సస్పెన్స్-థ్రిల్లర్  గ్రిప్పింగ్, ఇంటెన్స్ , సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.

నాగ చైతన్య అక్కినేని మాట్లాడుతూ, “నా స్ట్రీమింగ్ డెబ్యు కోసం ఇది పర్ఫెక్ట్ సిరీస్. నటుడిగా నేను ఓటీటీలో చాలా కంటెంట్‌ని చూస్తుంటాను. ఆ స్పెస్ ని ఎక్స్ ఫ్లోర్ చేయాలని భావించాను. సిరిస్ లో వర్క్ చేయడం అనేది సరికొత్త అనుభూతి. ఒకే పాత్రలో తోటి నటీనటులతో పాత్రలతో పాటు విస్తృతంగా యంగేజింగ్ ప్రయాణించడం ఆసక్తికరంగా, రిఫ్రెషింగ్ గా వుంది. ప్రైమ్ వీడియో సౌజన్యంతో దేశం నలుమూలలు, వివిధ ప్రాంతాలు, భాషల నుండి కథలు ప్రపంచ ప్రేక్షకులకు చేరువవుతున్నాయి. ఇది ఏ కళాకారుడికైనా అద్భుతమైన అవకాశం’’ అన్నారు.

Prime video of Telugu original series 'Dhoota' premiered at IFFI
Prime video of Telugu original series ‘Dhoota’ premiered at IFFI

పార్వతి తిరువోతు మాట్లాడుతూ..  “నేను సస్పెన్స్‌తో కూడిన థ్రిల్లర్‌లకు అభిమానిని. అయితే ధూత కథే నన్ను ఎంచుకుంది. ధూత నేను గతంలో చేసిన వాటికి భిన్నంగా ఉంది. విక్రమ్ కథకు మాత్రమే కాకుండా ప్రతి పాత్రను అద్భుతంగా మలిచారు . తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌లో అరంగేట్రం చేయడానికి నాకు 17 సంవత్సరాలు పట్టింది, అది ధూతతో జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.

దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ… ధూత క‌థ‌కి నా ఇన్స్టింక్ట్స్ తో వ‌ర్క్ చేశాను. ఇది సస్పెన్స్-థ్రిల్లర్ నుంచి కథానాయకుడు ప్రయాణంలో లోతైన, అర్థవంతమైనదిగా పరిణామం చెందింది. పాత్రలను వివరించేటప్పుడు, వ్రాసేటప్పుడు ఆ పాత్రలు ఎవరు పోషించాలనేది ముందే అనుకున్నాను. నేను ఆశించినట్లుగా నాగ చైతన్య, పార్వతి, ప్రియా, ప్రాచీ అందరూ అద్భుతంగా వారి పాత్రలని పోషించి థ్రిల్ చేశారు. వారందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.

నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ “విక్రమ్ ధూత కాన్సెప్ట్‌ని చెప్పినప్పుడు, నార్త్‌స్టార్‌లో మాకు ఖచ్చితంగా ల్యాండ్‌మార్క్ సిరిస్ అవుతుందని తెలుసు. మొదటి నుంచీ దర్శకుడు విక్రమ్ ఊహించినంత లోతుగా, వివరంగా ఒక కాన్సెప్ట్, కథ పూర్తి సామర్థ్యాన్ని చూపించే విధంగా సిరిస్ ని మలచాలని ముందే అనుకున్నాం. ధూత చాలా ప్రతిష్టాత్మకమైన తెలుగు సిరీస్‌లలో ఒకటి. ఇది అద్భుతమైన బృందం, అపారమైన అంకితభావం అవిశ్రాంత ప్రయత్నాల ఫలితం’’ అన్నారు.

‘ధూత’ డిసెంబర్ 1న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా 240 పోగా దేశాల్లో ప్రైమ్ వీడియోలో ప్రిమియర్ స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్