Friday, March 6, 2026

అసోంలో డోనర్ ప్రాజెక్టుల పురోగతి భేష్ :కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

- Advertisement -

అసోంలో డోనర్ ప్రాజెక్టుల పురోగతి భేష్

డబుల్ ఇంజన్ సర్కార్ తో తీవ్రవాద ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

Progress of donor projects in Assam is excellent: Union Minister Bandi Sanjay Kumar

హైదరాబాద్

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో 10 వేల మంది ఉల్ఫా తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలిశారు.
అభివ్రుద్ధి, మౌలిక సదుపాయాల్లోనూ పురోగతి
నరేంద్రమోదీ ప్రభుత్వ ప్రోత్సాహంవల్లే ఇదంతా సాధ్యమైందన్న అసోం అధికారులు.
క్రైం రేట్ తగ్గడంతోపాటు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం జరిగిందని వెల్లడి
గౌహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.
నేడు అసోంలోని దిమాహోసావో జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించనున్న బండి సంజయ్.
అస్సోం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివ్రుద్ధి, ప్రాయోజిత సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు వేగవంతంగా కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో గత ఐదేళ్లలో అస్సోంలో తీవ్రవాద ప్రాబల్యం పూర్తిగా తగ్గిందని, దాదాపు 10 వేల మంది ఉల్ఫా తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారని చెప్పారు. లొంగిపోయిన వారికి అందిస్తున్న సహాయ పునరావాస కారక్రమాలపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, పెట్టుబడుల వివరాలపైనా కేంద్ర మంత్రి ఆరా తీశారు. గత ఐదేళ్లలో ఒక్క చిన్న ఫిర్యాదు కూడా లేకుండా ఏకంగా 1 లక్షా 51 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అజయ్ తివారీ వెల్లడించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, ఇప్పటి వరకు దాదాపు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం జరిగిందన్నారు. ఒక్క సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుతోనే 27 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చాయన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏటా వ్రుద్ది రేటు పెరుగుతోందని, అదే సమయంలో క్రైం రేటు తగ్గుతోందని, కేంద్రం నూతనంగా అమలు చేస్తున్న క్రిమినల్ చట్టాల అమలులతోనూ ముందంజలో ఉన్నట్లు వివరించారు. మైనింగ్ రంగంలో చేపట్టిన సంస్కరణలతో దేశంలో అసోం నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ సిబ్బంది పనితీరులోనూ ఎంతో మార్పు వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలవల్లే అస్సోం రాష్ట్రంలోని ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన పురోగతి కన్పిస్తోందన్నారు.
ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు అస్సాం రాష్ట్ర రాజధానిలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్ర అతిథి గ్రుహంలో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలోని దిమా హసావో జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
తొలుత అసోంలో కేంద్ర నిధులతో జరుగుతున్న అభివ్రుద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై రెండు గంటలకుపైగా సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అజయ్ తివారీ, డీజీపీ హర్మిత్ సింగ్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ సందార్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో 10 శాతం నిధులను ఈశాన్య రాష్ట్రాల అభివ్రుద్ధికి కేటాయించడంతోపాటు ఆయా అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండటంతో ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు ఎంతో మెరుగయ్యాయని తెలిపారు. ముఖ్యంగా హోం, ఆరోగ్యం, వ్యవసాయం, రోడ్లు మరియు తాగునీటి రంగాల్లో అస్సాం రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. విద్య, పోషణ అభియాన్ నిధులు, వృత్తి విద్యలో అసెస్‌మెంట్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం గౌహాతిలోని ప్రసిద్ధ శక్తి పీఠమైన కామాఖ్య దేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. గర్భగుడిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకుని ఆలయ పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. కాగా బండి సంజయ్ శుక్రవారం గౌహాతి నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి దిమా హసావో జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు తీరు తెన్నులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్