పార్క్ లలో వాకర్స్ ను కలిసి ప్రచారం: తలసాని

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం తర్వాత పార్క్ లను ఎంతో అభివృద్ధి చేశామని, వాఁకర్స్ కు అన్ని సౌకర్యాలు కల్పించామని సనత్ నగర్ MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఉదయం సనత్ నగర్ లోని KLN పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ లలో వాకర్స్ ను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్క్ లలో పచ్చదనం పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణం, సౌకర్యాలు కల్పించడం వంటి అభివృద్ధి పనులతో లపార్క్ లకు వచ్చే వారి సంఖ్య పెరిగిందని చెప్పారు. KLN పార్క్ లో పాత్ వే ల నిర్మాణం, చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా  యోగా సాధకుల కోసం షెడ్డును కూడా నిర్మించామని  వివరించారు. సనత్ నగర్ డివిజన్ లో కూడా అనేక ప్రజా సమస్యలను పరిష్కరించామని అన్నారు. పెరిగిన ట్రాఫిక్ రద్దీ ని దృష్టిలో ఉంచుకొని ఫతే నగర్ ప్లై ఓవర్ విస్తరణ, ఇండస్ట్రియల్ పార్క్ నుండి బాలానగర్ చౌరస్తా వరకు అండర్ పాస్ నిర్మాణం కోసం100 కోట్ల రూపాయలు మంజూరైనాయని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని వివరించారు. మంత్రి వెంట సనత్ నగర్ BRS అధ్యక్షుడు కొలను బాల్ రెడ్డి, పార్క్ అధ్యక్షులు రమేష్ గౌడ్, రవీందర్ గౌడ్, ఖలీల్, శ్రీనివాస్, సురేష్ గౌడ్, యోగా గురువు కృష్ణ, శేషగిరి, లలితా చౌహాన్, సుబ్బరాజు తదితరులు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular