పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయి…

- Advertisement -

పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయి…

పదోన్నతులు జీవన శైలిని  మార్చే విధంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయి..

నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలి..

జిల్లా పోలీస్ కమిషనర్ డా. బి. అనురాధ

Promotions bring more responsibility…

సిద్దిపేట

హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా పదోన్నతులు పొందిన 7, సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్
పదోన్నతులు పొందిన 7 సిబ్బంది మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్  కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు, ప్రమోషన్ పొందిన సిబ్బందిని అభినందించారు.
ఈ సందర్భంగా పోలీస్  కమిషనర్  మాట్లాడుతూ. పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు, పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు. పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయని తెలియజేశారు, హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేసి ఉన్నత అధికారులకు ధన్యవాదలు తెలిపినారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్,  రాష్ట్ర పోలీసు సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి మరియు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular