- Advertisement -
ఎన్ హెచ్ నిర్వాసితులకు పరిహారం సత్వర పంపిణీ—జిల్లా కలెక్టర్ శ్రీధర్
Prompt distribution of compensation to NH evacuees---District Collector Sridhar
రాయచోటి,
అన్నమయ్య జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించి నిర్వాసితులకు భూ పరిహారం పంపిణీ వేగంగా పూర్తి చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ కు వివరించారు.మంగళవారం విజయవాడ సచివాలయం నుంచి రాష్ట్రంలో జాతీయ రహదారుల భూసేకరణ, అటవీ భూముల కేటాయింపు మరియు కోర్టు కేసుల అంశంలో జిల్లాల వారీగా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రాయచోటి కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో జాతీయ రహదారుల ప్రగతిని సీఎస్ కు కలెక్టర్ వివరించారు. ఎన్.హెచ్ 440 రాయచోటి నుండి వేంపల్లి వరకు చేపట్టిన రహదారికి సంబంధించి 95 శాతం భూసేకరణ పూర్తి చేశామని, ఇందులో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కింద రూ.11 కోట్లకు భూమిరాశి పోర్టల్ లో నమోదు చేసామన్నారు. త్వరలోనే ఆయా రైతుల ఖాతాల్లో నష్టపరిహారం జమ కావడం జరుగుతుందని చెప్పారు. ఎన్ హెచ్ 716 కడప – రేణిగుంట నాలుగు వరసల రహదారి విస్తరణలో భాగంగా జిల్లాలో వెళ్తున్న జాతీయ రహదారికి సంబంధించి దాదాపు 80% భూసేకరణ పూర్తి చేయడం జరిగిందన్నారు. అలాగే ఎన్ హెచ్ 71 మదనపల్లి- పీలేరు సెక్షన్ నాలుగు వరసల రహదారికి సంబంధించి కూడా 90 శాతం భూ సేకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. పూర్తి చేసిన భూసేకరణకు పరిహారం కూడా సంబంధిత రైతులకు చెల్లింపులు జరిగినట్లు తెలిపారు. ఆయా ప్రాజెక్టులలో ఇంకను మిగులు ఉన్న భూసేకరణకు చర్యలు వేగవంతం చేశామన్నారు. పరిహారం చెల్లింపుకు సంబంధించి సంబంధిత రైతులు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన వెంటనే వారికి కూడా పరిహారం చెల్లింపు చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు నిర్దేశిత కాల పరిమితిలో ఇంకను పెండింగ్ ఉన్న భూసేకరణ మరియు నష్టపరిహారం చెల్లింపు అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కు సి ఎస్ సూచించారు. ఈసమావేశంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
- Advertisement -