Friday, December 27, 2024

ఎన్నికల ఫిర్యాదుల పై వేగంగా స్పందించాలి

- Advertisement -

సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం, ఎంసిఎంసీ , మీడియా సెంటర్ ల ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి

వాయిస్ టుడే ప్రతినిధి  రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 13: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల ఫిర్యాదుల పై వేగంగా స్పందించాలనీ కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు.

Prompt response to election complaints
Prompt response to election complaints

శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం గ్రౌండ్ ఫ్లోర్ లో 24 గంటలు పని చేసే సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం, ఎంసిఎంసీ , మీడియా సెంటర్ ల ను  కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ తో కలిసి ప్రారంభించారు.జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు నిస్వాక్షపాతంగా స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో జరగడంలో సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం, ఎంసిఎంసీ , మీడియా సెంటర్ కీలక పాత్ర అన్నారు.ఎన్నికలలలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా.. మీడియా లో ఫేక్ న్యూస్ ప్రసారమైన, ఓటర్లు ఏదైనా సందేహాల నివృత్తి కి, సమాచారం కోసం సంప్రదించిన వెంటనే స్పందించాలని చెప్పారు. సి – విజిల్ ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించాలన్నారు. ఎక్కడైనా మద్యం, డబ్బు లు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే క్షేత్ర స్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్ లను అప్రమత్తం చేయాలన్నారు. ప్రతి విభాగానికి వేరు వేరు గా రికార్డ్ లను నిర్వహించాలన్నారు

Prompt response to election complaints
Prompt response to election complaints

ఎన్నికల ప్రకటనలు, ప్రచారాలపై నిఘా పెట్టాలి

ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు, ప్రచారాలపై మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ గట్టి నిఘా పెట్టాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి ఎంసిఎంసి బాధ్యులకు సూచించారు.ఎంసీఎంసి సభ్యులు నిరంతరం వివిధ  వార్తాపత్రికలు, టెలివిజన్, ఇతర ప్రసారామాద్యామాల ద్వారా ప్రసారమయ్యే చెల్లింపు వార్తలు, రాజకీయ ప్రకటనలను తనిఖీ చేయడంతో పాటు ప్రసారాలు, ప్రకటనలు వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన నివేదికలను రూపొందించి ఎన్నికల అధికారులకు పంపించాలని సూచించారు.  ప్రకటనలకు సంబంధించి యం.సి.యం.సి అనుమతి పొందే విధంగా చూడాలన్నారు. ప్రకటనలకు అయ్యే ఖర్చులను పార్టీల ఖాతాలలో జమయ్యేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్, డిపిఆర్ఓ మామిండ్ల దశరథం , జిల్లా కార్మిక అధికారి రఫీ, ఎస్సీ కార్పొరేషన్ లిమిటెడ్ కార్య నిర్వాహక సంచాలకులు డాక్టర్ వినోద్, సీపీవో పిబీ శ్రీనివాస చారి,ఏఓ రామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్