Sunday, September 8, 2024

డిప్యూటీ మేయర్ పద్మారావుకి నిరసన సెగ

- Advertisement -

మాణికేశ్వరి నగర్ లో ఆసుపత్రి నిర్మిస్తా.. వివాదం చేయద్దు:

తీగుళ్ల పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ అక్టోబర్ 27 (వాయిస్ టుడే ప్రతినిధి): ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ కు శుక్రవారం తార్నాక డివిజన్ పరిధిలో నీ మాణికేశ్వరినగర్ లో
ప్రచార ప్రారంభ సమయం లో నే నిరసన సెగ తగిలింది, ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు విషయంలో బస్తీ వాసులు బస్తీ ముఖ ద్వారం వద్దనే అడ్డుకొని నిలదీశారు. తమకు ఆసుపత్రి ఏర్పాటు చేయాలని 126 రోజుల దీక్షను పద్మారావు హామీతో విరమించామని, అనంతరం ఆసుపత్రి విషయమే పట్టించుకోకుండా వడ్డెర కులస్తులం అయిన మమ్మల్ని చులకన చేస్తూ మాట్లాడడం బాధాకరమన్నారు, ఆసుపత్రి నిర్మించే వరకు బస్తీకి రావద్దని, పద్మారావు గో బ్యాక్ అంటూ నినందించారు. దీనిపై పద్మారావు గౌడ్ వివరణ ఇస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ని నిర్మించాలన్న స్థానికుల అభిమతాన్ని తాము గౌరవించి, ప్రభుత్వం నుంచి అనుమతిని పొందామని చెప్పారు. స్థల సేకరణ, నిధుల మంజూరు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆసుపత్రిని తామే నిర్మిస్తామని స్పష్టం చేశారు. స్థానికులతో కలిసి ఈ అంశంపై మున్సిపల్ మంత్రి కేటీఆర్ తో మాట్లాడమని గుర్తు చేశారు. ఆసుపత్రి నిర్మించే విషయాన్ని వివాదం చేయవద్దని సూచించారు. ఇచ్చిన హామీలు నేరవేర్చానని బస్తీ వాసులకు నచ్చజెప్పి పాదయాత్రను ప్రారంభించారు.
ఈ పర్యటనలో రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు.

protest-to-deputy-mayor-padmarao-seg
protest-to-deputy-mayor-padmarao-seg

అనంతరం పద్మారావు గౌడ్ మాట్లాడుతూ, ప్రజల నుంచి తమకు విశేష స్పందన లభిస్తుందన్నారు. సికింద్రాబాద్ ప్రజల సంక్షేమo కోసం నిరంతరం శ్రమించానని, మరో అవకాశం కల్పించి తనను గెలిపించడంతో పాటు సీఎం కెసిఆర్ హ్యాట్రిక్ సాధించడంలో సహకరించాలని కోరారు. ప్రచారంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి , బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి , కార్పొరేటర్ లు సామల హేమ, కంది శైలజ, లింగాని ప్రసన్నలక్ష్మి , రాసురి సునీత, బీఆర్ఎస్ నాయకులు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, కిరణ్ కుమార్, త్రినేత్ర గౌడ్, ఆలకుంట హరి, కరాటే రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్