- Advertisement -
మంత్రులకు నిరసన సెగ
Protest to Ministers Sec
కరీంనగర్
నారాయణపూర్ ప్రజాపాలన గ్రామసభలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లకు నిరసన సెగ తగిలింది. నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు ఆందోళన కు దిగారు. రిజర్వాయర్ తో తమ కొంపలు ముంచొద్దని నిరసన చేసారు. కంటతటి పెట్టి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ముంపు బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హమీ ఇచ్చారు.
గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి నామమాత్రం ప్రయోజనం చేకూర్చింది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం జరిగేలా చూస్తుంది. నారాయణపూర్ రిజర్వాయర్ కు ప్రాధాన్యత ఇచ్చి ఏడాదిలో పూర్తి చేయిస్తాం. ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాం. పదేళ్ళు ఏ పని చేయలేదు… ఇప్పుడు అన్ని పనులు చేస్తామని అన్నారు.
ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. పదేళ్ళుగా ఒక్క కొత్త రేషన్ కార్డు గత ప్రభుత్వం ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. రేషన్ కార్డులు తోపాటు ఉచితంగా సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. ఇళ్ళు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం. రైతు భరోసా క్రింద ఎకరాన 12 వేలు ఇస్తున్నాం భూమిలేని వారిని 12 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
- Advertisement -



