- Advertisement -
హరీష్ రావు నిజాయితీ నిరూపించుకో
Prove the honesty of Harish Rao
సిద్దిపేట జిల్లా వాసులు
హైదరాబాద్
ఒక్క గుంట కూడా భూమిని కబ్జా చేయలేదని ప్రగడ్బాలు పలుకుతున్న మాజీ మంత్రి హరీష్ రావు తన నిజాయితీని నిరూపించుకోవాలని సిద్దిపేట జిల్లా వాసులు న్యాయవాది జెల్లా రవీందర్ యాదవ్, అశోక్, రమేష్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సిద్దిపేట లో హరీష్ రావు రాజ్యాంగం ఇప్పటికి కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. సిద్దిపేటలో అభివృద్ధిలో దూసుకుపోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. అభివృద్ధి మాటున అరాచకాలు ఎన్నో కొనసాగుతున్నాయని అన్నారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణం సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో స్థానిక రైతులను భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద నుంచి ఎకరాల కొద్ది భూమిని కొనుగోలు చేశారని ఆరోపించారు. నేరుగా రంగనాయక సాగర్ కోసం సేకరించిన భూమి నుంచి 9 గుంటల భూమిని అక్రమంగా తన పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. సప్త సముద్రాలు ఈదిన వాడు పిల్ల కాలువలో పడి కొట్టుమిట్టాడినట్లుగా ప్రస్తుతం 9 గుంటల భూమి హరీష్ రావు నిజాయితీని ప్రశ్నిస్తుందని అన్నారు. తాను ఒక్క గుంట భూమిని కూడా కబ్జా చేసుకోలేదని చెబుతున్న హరీష్ రావు కు సిఐడి ఎంక్వయిరీ కోరే దమ్ముందా అని ప్రశ్నించారు. దీంతోపాటు సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పేరిట జరిగిన అక్రమాలు ఎన్నో ఉన్నాయని ప్రస్తుత ప్రభుత్వం వాటిని సమగ్రంగా విచారణ జరిపి వెలికి తీయాలని కోరారు.
- Advertisement -