ప్రజావాణి సమస్యలను అధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలి

- Advertisement -

 ప్రజావాణి సమస్యలను అధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల, జూలై 15

Public broadcasting issues should be addressed with high priority

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలను అధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్  సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్లు పి.రాంబాబు, గౌతమ్ రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్  స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 91 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
డెంగ్యూ నివారణకు చర్యలు
జిల్లాలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.అన్ని ఆఫీసుల్లో ఫాగ్ స్ప్రే చేయించాలనన్నారు., జిల్లా అంత చేసి కలెక్టరేట్ లో సైతం సానిటేషన్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి, జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి ఆర్దీఓలు మధు సుధన్, ఆనంద్ కుమార్, ఎన్. శ్రీనివాస్, కలెక్టరేట్ ఏ.ఓ. హన్మంతరావు,  వివిధ  జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular