- Advertisement -
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులు పునరావృతం కాకూడదు
Public Problem Redressal Forum Complaints should not be repeated విచారణ జరిపి చట్ట పరిధిలో న్యాయం చేస్తాం
జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
నంద్యాల
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఫిర్యాదిదారుల నుంచి 86 ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని , ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని , ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించరాదని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని వారు ప్రతి సోమవారం మీకు దగ్గరలోని పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్, డిఎస్పి కార్యాలయాల్లో జరిగే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక “కార్యక్రమంలో ఫిర్యాదు చేయవచ్చని వాటిని కూడా ఫిర్యాదులను పరిగణించి సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
- Advertisement -




