ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి–కలెక్టర్ పమేలా సత్పతి
Public voice complaints should be resolved quickly--Collector Pamela Satpathyకరీంనగర్
ప్రజావాణి లో చేసే ఫిర్యాదులను వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్ స్థానిక సంస్థలు, లక్ష్మికిరణ్ రెవిన్యూ, ఇతర ఉన్నత అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు.
ప్రజావాణి కి మొత్తం 298 దరఖాస్తులు రాగా ఇందులో అత్యధికంగా కరీంనగర్ నగర పాలిక సంస్థకు 45, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి 18, కొత్తపెల్లి తహసీల్దార్ కార్యాలయానికి 13 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డిఆర్ఓ పవన్ కుమార్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భూమి సేకరించాలి..
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతి మండలంలో కనీసం 10 ఎకరాల భూమిని గుర్తించాలని అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ స్థానిక సంస్థలు ఆదేశించారు. ఇందుకు దేవాదాయ శాఖ భూములను పరిగణనలోకి తీసుకోవాలని మండల అధికారులకు సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మీ లాగిన్ లో ఉన్న అన్ని దరఖాస్తులను పూర్తిస్థాయిలో ధ్రువీకరించి కలెక్టర్ కు పంపించాలని అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్.. మండలాధికారులను ఆదేశించారు.




