- Advertisement -
పుష్ప ఇప్పుడు పొలిటికల్ ఫైర్…
Pushpa is now a political fire...
హైదరాబాద్, డిసెంబర్ 24, (వాయిస్ టుడే)
లంగాణ రాజకీయంలో కొత్త పరిణామాలు కనిపిస్తున్నాయ్. పుష్ప రచ్చతో ఇది వైల్డ్‌ఫైర్ కాదు.. పొలిటికల్ ఫైర్ అనిపిస్తోంది. పుష్ప-2 బెనిఫిట్ షో చూసేందుకు ఫ్యామిలీతో కలిసి హీరో బన్నీ.. హైదరాబాద్ సంధ్య థియేటర్‌కు వెళ్లగా.. ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలోరాజకీయ యుద్ధం దిశగా మలుపు రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. తొక్కిసలాట ఘటనను సీరియస్‌గా తీసుకున్న రేవంత్ సర్కార్.. రేవతి మరణానికి కారణమంటూ హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయడం.. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయ్. కట్ చేస్తే.. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ వ్యాఖ్యలతో వివాదం మరింత రాజుకుంది. రాజకీయ యుద్ధం దిశగా మలుపు తిరిగింది.తొక్కిసలాట ఘటనను అసెంబ్లీలో ప్రస్తావించిన రేవంత్.. హీరో బన్నీతో పాటు.. సినిమా ఇండస్ట్రీ తీరును తప్పుబట్టారు. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండబోవని క్లియర్‌గా చెప్పేశారు. ఐతే ఆ తర్వాత బన్నీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ.. తొక్కిసలాట రోజు పరిస్థితులను వివరించే ప్రయత్నం చేయగా.. సీన్ మరింత వైల్డ్‌గా మారింది. బన్నీ తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుండగా.. ఓయూ విద్యార్థి నేతలు అతని ఇంటిపై దాడులకు దిగారు.
తొక్కిసలాట ఘటన.. ఆ తర్వాత పరిణామాలు.. కాంగ్రెస్ ఘాటు విమర్శలతో.. పరిస్థితి హాట్‌హాట్‌గా మారింది. ఐతే రేవంత్ సర్కార్‌కు కౌంటర్‌గా బీజేపీ రంగంలోకి దిగడంతో.. సీన్ పొలిటికల్ కోర్టులోకి చేరింది. అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై.. కాంగ్రెస్ నాయకత్వంపై మొదటి నుంచి బీజేపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. అసెంబ్లీ ఎపిసోడ్ తర్వాత బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా సీఎం రేవంత్‌ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.ప్రభుత్వం కావాలనే సినీ ఇండస్ట్రీని ఇబ్బందులకు గురి చేస్తోందని.. కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపణలు గుప్పించారు. సంధ్య థియేటర్ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ వ్యక్తిగతంగా కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పాలమూరు ఎంపీ డీకే అరుణ కూడా.. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు.మనసులో ఏదో పెట్టుకొని… మరేదో విధంగా రేవంత్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బన్నీ నివాసంపై దాడులకు దిగడంతో.. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేకుండా పోయాయని విమర్శించారు. సినీ పరిశ్రమను ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదంటూ మరో ఎంపీ లక్ష్మణ్.. కాంగ్రెస్ సర్కార్ మీద విమర్శలు గుప్పించారు.సినిమా ఇండస్ట్రీకి బీజేపీ నేతలు మద్దతుగా నిలుస్తుండడంతో.. కాంగ్రెస్ పొలిటికల్ ఎటాక్ స్టార్ట్ చేసింది. తమ ప్రభుత్వం పేదలు, సామాన్యుల పక్షాన నిలుస్తుంటే.. బీజేపీ మాత్రం సినీ ఇండస్ట్రీ వైపు నిలవడం ఏంటని ప్రశ్నిస్తోంది. తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తూ.. వత్తాసు పలుకుతోందంటూ హస్తం పార్టీ నేతలు ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు.దీంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చాప్టర్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఓ వైపు రాజకీయంగా యుద్ధం సాగుతుంటే.. మరోవైపు ఇండస్ట్రీని మరో టెన్షన్ వెంటాడుతోంది. ఇకపై బెనిఫిట్ షోలతో పాటు.. టికెట్ ధరల పెంపు ఉండబోదని సీఎం రేవంత్ స్పష్టం చేయడంతో… సినిమా పరిశ్రమ పెద్దలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలే రాబోయేది సంక్రాంతి సీజన్.పెద్దహీరోల సినిమాలు క్యూలో ఉన్నాయ్. ఇలాంటి సమయంలో టికెట్ ధరల పెంపు లేకపోతే.. రెవెన్యూ మీద భారీగా ప్రభావం పడే చాన్స్ ఉంటుంది. దీంతో ప్రభుత్వ పెద్దలను కూల్ చేసేందుకు.. ఇష్యూను సెటిల్ చేసేందుకు.. NDAలో భాగస్వామి అయిన పవన్‌ను కలిసేందుకు.. ఇండస్ట్రీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. సినీరంగానికి చెందిన వ్యక్తి కావడంతో.. ఆయనతో సంప్రదింపులు జరపాలని కూడా భావిస్తున్నారట.సంధ్య థియేటర్ ఘటన, సినీ ఇండస్ట్రీ వ్యవహారం… రోజురోజుకు రాజకీయరంగు పులుముకుంటోంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలా మారింది. ఇక నెక్ట్స్ సినీ పెద్దలు జనసేన అధినేతను కలుస్తుండటంతో.. ఈ వ్యవహారం ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీయే కూటమి అన్న చందంగా మారుతుందా అనే చర్చ మొదలైంది.
- Advertisement -