అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత పుట్ట మధు కు లేదు
Putta Madhu has no moral qualification to talk about development
-ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
-పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు
మంథని
అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కు లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.
శనివారం మంథని పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, మండల యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, పాక్స్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ప్రచార కమిటీ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని, అనేక మాయమాటలు చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కెసిఆర్ మీద ఎన్ని కేసులు పెట్టాలని నాయకులు ప్రశ్నించారు.ఓడేడు బ్రిడ్జ్ మరియు తాడిచెర్ల భూపాల్ పల్లి రోడ్డును తక్షణమే పూర్తి చేయాలని పుట్ట మధు మాట్లాడారు కదా పదేళ్లు పుట్ట మధు ఏం చేశాడని నాయకులు ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే మేలు జరిగే ఏ పనినైనా మా నాయకులు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పూర్తి చేస్తారని తెలిపారు.80% ఉన్న బీసీల కోసం పోరాటం చేస్తా అంటున్నావ్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా ఎంతమంది బీసీలను అభివృద్ధి పదంలోకి తీసుకువచ్చినవ్, ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇపిచ్చినవ్, ఎంతమంది దళితులకు దళిత బంధు, ఎంతమంది బీసీలకు బీసీ బంధు ఇపిచ్చినవ్ అని మేము అడుగుతా ఉన్నాం కాపు సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ అయినా నిర్మించినవా అని ఈ సందర్భంగా వారు అడుగుతున్నామన్నారు. వామన్ రావు దంపతులు హత్య కేసులో ఇక్కడున్నటువంటి బీసీ ఎస్సీలను ఉసిగొల్పి జైలు పాలు చేసిన వ్యక్తివి నువ్వు కాదా పుట్ట మధు అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. జేఎన్టీయూలో వందల మంది ఎస్సీ ఎస్టీ బీసీలను తొలగించిన నీచ చరిత్ర నీది కాదా అన్నారు.నీతి నిజాయితీ గురించి మాట్లాడతావున్నావ్ నువ్వు నీ సతీమణి నీ అల్లుళ్ళు పచ్చని పొలాల మీద మీడుతల దండు పడ్డట్టు మంథని నియోజకవర్గం మీద పడి దోచుకొని దాచుకున్న చరిత్ర నీది గంజి, గట్క, అంబలి అన్నావు ఇప్పుడు రాజగృహ, ఫాం హౌస్ లు, చేపల చెరువులు, వందల ఎకరాల భూములు, వేలకోట్ల ఆస్తులు కూడగట్టుకున్న ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినయి అని ప్రశ్నించారు. నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడితే మంథని నియోజక వర్గ ప్రజలు నవ్వుతున్నారని అన్నారు. నువ్వు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మూడుసార్లు ఓడిపోయినవ్ అంటే ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా నిన్ను వ్యతిరేకిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తాఉన్నామన్నారు. శ్రీధర్ బాబు నాయకత్వంలో ఈ మంథని నియోజక వర్గం అభివృద్ధి చెందుతుందని నమ్మి ఇక్కడున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జీవితాల్లో దుద్దిల్ల శ్రీధర్ బాబు వెలుగులు నింపుతారని వారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారిని గెలిపిస్తున్నారని తెలిపారు.నువ్వు 2014లో గెలిచిన తర్వాత అనేకమంది బీసీల పైన దాడులు చేసింది నిజం కాదా అనేకమంది ఎస్సీలను హత్యగావించింది నిజం కదా అని అన్నారు.కులాల మధ్య చిచ్చు రేపుతూ మాట్లాడితే బ్రాహ్మణ సామాజిక వర్గం మీద విరుచుకుపడుతున్నావ్ కులాలు కాదు ఈ ప్రాంతానికి కావాల్సింది అభివృద్ధి కావాలే మా నాయకుడు శ్రీధర్ బాబు విజన్ ఉన్న నాయకుడు మీరు నీ పంధ మారచ్చుకోకుండా ఇలాగే కులాల మధ్యలో చిచ్చు పెడుతూ ఈ ప్రాంతంలో అల్లర్లు చెలరేగే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. పోలీసు శాఖ ను మేము కోరుతున్నాం ఈ ప్రాంతంలో అల్లర్లు సృష్టించడానికి పుట్ట మధు ప్రయత్నిస్తున్నాడని
అతని పైన కేసు నమోదు చేయాలేనన్నారు.
నువ్వు ఇంకోసారి కులం గురించి మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరితో కలిసి కాంగ్రెస్ పార్టీ మంథనిలోని నీ ఇంటిని ముట్టడిస్తామని ఈ సందర్భంగా పుట్టమదు ను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుదుల వెంకన్న, జనగామ నరసింగారావు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, బీసీ సెల్ మండల అధ్యక్షులు ఐలి శ్రీనివాస్,ఎన్ఎస్యుఐ డివిజన్ అధ్యక్షులు కెక్కేర్ల సందీప్, నాయకులు మాజీ సర్పంచ్ దొరగొర్ల శ్రీనివాస్, జనగామ సడవలి,పెరుగు తేజ,అక్కపక సధి,చంద్రు విజయ్, బుడిద రంజిత్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.