నామినేషన్ దాఖలు చేసిన బిఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్

- Advertisement -

రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన పుట్ట మధు

మంథని: భారత్ రాష్ట్ర సమితి మంథని నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా, బిఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ ,మంథని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్డీవో)కార్యాలయంలో పుట్ట మధుకర్ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి వి. హనుమా నాయక్ కు సమర్పించారు.  నామినేషన్ వేసేందుకు పుట్ట మధు ఇలాంటి అట్టహాసాలు లేకుండా సాదాసీదాగా తన భార్య మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ మరో ముగ్గురు అనుచరులను తీసుకెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆయన వెంట జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని రాకేష్, నాయకుడు మాదాడి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ న్యాయవాది శశికాంత్ కాచే లు ఉన్నారు.

Putta Madhukar is the BRS candidate who filed the nomination
Putta Madhukar is the BRS candidate who filed the nomination
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular