కరీంనగర్, నవంబర్ 1, (వాయిస్ టుడే): కరీంనగర్ అసెంబ్లీ నియోజవకర్గంలో ముగ్గురు ఆశావాహులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు టికెట్ ఇచ్చే అవకాశం లేదని, ప్రముఖ వ్యాపార వేత్త జయపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అయితే, పాత వారికి కాకుండా, కొత్త వారికి టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు రంగం సిద్ధమవుతుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసి, ప్రచారంలో దూసుకుపోతుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం అభ్యర్థుల వేట మునిగితేలుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఇంకా కొలిక్కి రాలేదు. రెండవ జాబితాలోనే టికెట్ వస్తుందని భావించారు. అయితే.. రెండవ జాబితాలో కరీంనగర్ స్థానం పేరు కనించలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశ నెలకొంది.కరీంనగర్ అసెంబ్లీ నియోజవకర్గంలో ముగ్గురు ఆశావాహులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు టికెట్ ఇచ్చే అవకాశం లేదని, ప్రముఖ వ్యాపార వేత్త జయపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అయితే, పాత వారికి కాకుండా, కొత్త వారికి టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు మాత్రమే టికెట్ ఇవ్వాలంటూ సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ విషయంలో ఇంకా జాప్యమే కనబడుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, సిరిసిల్ల స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించలేదు.. కరీంనగర్‌లో మాత్రం కాంగ్రెస్ అశావాహుల్లో ఎక్కువ పోటీ నెలకొంది. మొన్నటి వరకు నలుగురు నేతలు పోటీ ఉన్నారు. అయితే, టికెట్ వచ్చే అవకాశం లేదని భావించిన జయపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడి.. గులాబీ గూటికి చేరారు. ప్రస్తుతం కరీంనగర్ పట్టణ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు, బొమ్మకల్ సర్పంచ్ పురమల్లు శ్రీనివాస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. పురమల్లు శ్రీనివాస్ ఇటీవలె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నరేందర్ రెడ్డి లేదంటే, ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు ఇవ్వాలంటున్న కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. పార్టీ కోసం పని చేసిన వారికే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.ఇదిలావుంటే పురమల్లు శ్రీనివాస్‌కు టికెట్ కన్‌ఫార్మ్ అన్న ప్రచారం సాగుతుంది. దీంతో ఆయన ప్రచార రథాలు కూడా సిద్ధం చేసుకున్నారు. హడావిడి లేకుండానే ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ ఖరారైన తరువాత ప్రచారాన్ని ముమ్మరం చేస్తానని శ్రీనివాస్ చెబుతున్నారు. అయితే, ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు బీసీలే. దీంతో.. కాంగ్రెస్ వేరే సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కొంత మంది నేతలు కోరుతున్నారు.ఇక ఇక్కడ ఇప్పటికే.. బీఆర్ఎస్ ప్రచారాన్ని ఉధృతం చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ నియోజకవర్గం మొత్తం ఒక్కసారి తిరిగారు. అదే విధంగా బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కూడా ప్రచారం నిర్వహించారు. వివిధ సభలు, సమావేశాలతో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ మాత్రం ఇంకా జనంలోకి వెళ్లలేదు.. కొత్తవారికి అవకాశం ఇస్తే, సహకరించమని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. ప్రజా బలం ఉన్న నేతలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ కొత్త నేతకు టికెట్ ఇస్తే ఇక్కడ ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. మొదట నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్యారాచూట్ నేతలకు అవ్వకాశం ఇవ్వవద్దని అంటున్నారు. అలాంటి నేతలుకు టికెట్ ఇస్తే, పార్టీ బలహీనపడుతుందని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం టికెట్ కోసం నేతలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.