- Advertisement -
ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యల సత్వర పరిష్కారం
Quick resolution of public issues with Prajavani programme
ప్రజావాణికి 47 దరఖాస్తుల స్వీకరణ
జోగులాంబ గద్వాల
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను త్వరగా పరిష్కారం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయములోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 47 మంది తమ సమస్యల పరిష్కరం కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యెక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ,నర్సింగ్ రావు లతో కలసి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు.వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -