- Advertisement -

రాచకొండ: రాచకొండ పోలీస్ కమిషనర్ డి.ఎస్ చౌహన్ బుధవారం నాడు కొత్త గూడ, పెద్ద అంబర్ పేట పోలీసు స్టేషన్ల పరిధిలోని పోలీసు చెక్ పోస్టులను సందరర్శించి ఎన్నికల భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేయాల్సిన తనిఖీల మీద సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కమిషనర్ పేర్కొన్నారు. అవసరమైన చోట మరిన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు అక్రమ నగదు తరలింపును అడ్డుకోవడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ తెలిపారు
- Advertisement -



