దేశంలో ఉన్న నిరుద్యోగం గురించి మీడియా మాట్లాడదు
మీడియా అనుసరిస్తున్న విధానాన్ని తప్పుపట్టిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ డిసెంబర్ 22
దేశంలో ఉన్న నిరుద్యోగం గురించి మీడియా మాట్లాడదని, కానీ పార్లమెంట్‌లో సస్పెండ్ అయిన ఎంపీలు నిరసన చేపడుతుంటే తాను వీడియో తీస్తున్న దృశ్యం గురించి చర్చిస్తాయని రాహుల్ గాంధీ
మీడియాను విమర్శించారు. పార్లమెంట్ మకర ద్వారం వద్ద మాక్ పార్లమెంట్ నిర్వహిస్తున్న ఎంపీలను రాహుల్ వీడియో తీసిన విషయం తెలిసిందే. ఆ అంశంపై పలు పార్టీలు భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం
చేశాయి. ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి ధర్నా ప్రదర్శనలో రాహుల్ మాట్లాడుతూ మీడియా అనుసరిస్తున్న విధానాన్ని ప్రశ్నించారు. లోక్‌సభలో స్మోక్ అటాక్ జరిగిందని, భద్రతా వైఫల్యం
ఉన్నా.. దానికి కారణం ఏంటో గ్రహించాలన్నారు. నిరుద్యోగం వల్లే ఆ అటాక్ జరిగినట్లు రాహుల్ తెలిపారు.