రాహుల్ ది మిడిమిడి జ్ఞానం
హైదరాబాద్
కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీఎంఎఫ్ స్టాల్ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ గనుల శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 23రాష్ట్రాల్లోని 645 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (DMF) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాలతో.. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలకు.. బొగ్గు, ఇతర ఖనిజాల గనుల సీఎస్సార్ R యాక్టివిటీలో భాగంగా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. గనులున్న ప్రాంతాల ప్రజల విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, నైపుణ్యత, స్వయం సహాయక బృందాలకు అవసరమైన శిక్షణ, ప్రోత్సాహాన్ని అందించే కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.
దేశవ్యాప్తంగా డీఎంఎఫ్ ఆధ్వర్యంలో రూ.92వేల కోట్లకు పైగా నిధులున్నాయి. ఇందులో రూ.50,900 కోట్లను వెచ్చించి 3,29,945 ప్రాజెక్టులు చేపట్టాం. ఇందులో 1,88,642 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయం సహాయక బృందాల మహిళలను లఖ్పతి దీదీలుగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఇందులో భాగంగా.. డీఎంఎఫ్ నిధుల ద్వారా.. స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులకు సరైన గుర్తింపును కల్పించడం, రానున్న రోజుల్లో వీరికి ఆదాయ వనరులను సమకూర్చే లక్ష్యంలో భాగంగా.. ఇవాళ డీఎంఎఫ్ స్టాల్ ప్రారంభించుకున్నాం. దశలవారిగా వీరికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాం.ఇప్పటికే ఢిల్లీ హాట్ లో శాశ్వత ప్రాతిపదికన ఓ స్టాల్ ఏర్పాటు చేశాం. పర్యావరణ పరిరక్షణకు సరైన ప్రాధాన్యతనిస్తూ.. అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం మా ప్రధాన లక్ష్యంమని అన్నారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై
రాహుల్ గాంధీది మిడిమిడి జ్ఞానం. హిందువులపై విద్వేషపూరితంగా మాట్లాడుతూ.. మరోవైపు ఉగ్రవాద సంస్థలు, సన్నిహితులతో ఆయన దోస్తీ చేస్తున్నారు.హిందువులను కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. హిందువులు మెజారిటీగా ఉన్నన్ని రోజులే దేశంలో ప్రజాస్వామ్యం, సామరస్యపూర్వక వాతావరణం ఉంటుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయన దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.
రాహుల్ ది మిడిమిడి జ్ఞానం
- Advertisement -
- Advertisement -