అయోడిన్ లోపాలపై అవగాహన పెంచుకోండి
Raise awareness of iodine deficiencies
మండల విద్యాధికారి భూమయ్య
జగిత్యాల,
మనం తీసుకొనే ఆహారంలో సమతుల్యత కోల్పోయి అయోడిన్ లోపం ఏర్పడుతుందని దీనిపై ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన పెంచుకోవాలని జగిత్యాల మండల విద్యాధికారి భూమయ్య అన్నారు. ఇనిష్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఐటీసి సహకారంతో స్మార్ట్ ఆశీర్వాద్ కార్యక్రమం లో భాగంగా శుక్రవారం స్థానిక ఓల్డ్ హైస్కూల్ విద్యార్థులకు అయోడిన్ లోపాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్ ఈ వో భూమయ్య మాట్లాడుతూ మనం తీసుకొనే ఆహారంలో సరిపడా అయోడిన్ లేని ఉప్పు లభించక అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయాన్నారు. అయోడిన్ లేని ఉప్పు తీసుకోవడం తో గొంతు సంబంధిత, బుద్ది మాంద్యం, శారీరక ఎదుగుదల సమస్యలు వంటి ఎన్నో సమస్యలు ఎదురౌవుతాయని అన్నారు. ప్రతి విద్యార్ధి అయోడిన్ లోపలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు అవగాహనకై చిన్న తెరపై స్లయిడ్స్ ను ప్రదర్శించారు. విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం మేనేజర్ గుంటి రవికుమార్, రిసోర్స్ పర్సన్ వంశీ కృష్ణ, టీమ్ సభ్యులు రచన, సంధ్య, తిరుపతి, సంజన, ఆ పాఠశాల హెచ్ ఎమ్ చంద్రకళ, టీచర్లు బోయినిపెల్లి ఆనందరావు, సూర్య ప్రకాశ్, విద్యాదేవి, మల్లి ఖార్జున్, సంజీవయ్య, అరుణ,హరిత, సావిత్రి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.