రాజ్ భవన్ లో రక్షాబంధన్ వేడుకలు
సైనికులకు రాఖీ కట్టిన గవర్నర్ తమిళసై సౌందరరాజన్
హైదరాబాద్: రాజ్ భవన్ లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సైనికులకు రాఖీ కట్టారు. రక్షా బంధన్ వేడుకల్లో 35 మంది సైనికులు, 25 విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గోన్నారు.
గవర్నర్ తమిళసై మాట్లాడుతూ తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయం. రాజభవన్ అనేక చరిత్రలను సృష్టిస్తుంది. ఈ రోజు రక్షాబంధన్ ను చంద్రుడి మీద కూడా జరుపుకుంటున్నాం. చంద్రుడితో పాటు సూర్యుణ్ణి కూడా మనం చేరుకోబోతున్నాం. మన దేశంలో ఎన్ని విభిన్నతలు ఉన్నా… మనమంతా ఒకటే అనే బంధము ఉందని అన్నారు. సోదరసోదరీ బంధం చాలా అద్భుతమైనది. సైనికుల సేవలకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. వారి వల్లే మనం సురక్షితంగా ఉన్నామనే సంకేతాన్ని పంపడానికీ ‘ రాఖీ ఫర్ సోల్డర్స్’ నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రజలతో ఎంతో అనుబంధం ఉంది. తెలంగాణ ప్రజల సోదరిగా అందరికి రక్షబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సోదరి రాజ్ భవన్ లో ఉందని అన్నారు. తరువాత సైనిక దళాల అధికారులకు రాఖీ కట్టారు.