రామగుండమా… నేను రాను…
Ramagundam... I will not come...– ఒకవేళ వచ్చిన… ఏడాది కంటే ఎక్కువ ఉండరు…
– కార్పొరేషన్ కమిషనర్ గా రావాలంటే విముఖత..
– ఇన్చార్జి కమిషనర్లతోనే నెట్టుకొస్తున్న రామగుండం బల్దియా..
రామగుండం :
అమ్మో… రామగుండమా…! నేనంటే నేను వెళ్ళను… అన్నట్టుగా రామగుండం నగరపాలక సంస్థకు కమిషనర్ గా రావాలంటేనే ప్రభుత్వ అధికారులు జెంకుతున్నారు. ఒకవేళ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఇక్కడ పోస్టింగు వచ్చిన… ఏడాది కంటే ఎక్కువగా ఎవరు ఉండటం లేదు. రామగుండం రాజకీయాల ప్రభావంతో ఇక్కడికి ఎలాంటి కమిషనర్ వచ్చిన వెంటనే బదిలీ చేయించుకుంటున్నారు. గత దశాబ్ద కాలంలో ఒకరు ఇద్దరు తప్పితే ఏ ఒక్క కమిషనర్ కూడా ఏడాది కంటే ఎక్కువగా పనిచేయలేదు. కొందరైతే ఇక్కడ విధుల్లో చేరిన రెండు మూడు రోజులకే తిరిగి బదిలీపై వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. రామగుండం నగరపాలక సంస్థ అంటేనే అవినీతికి కేంద్ర బిందువుగా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ కాంట్రాక్టర్లు, కార్పొరేటర్లకు నచ్చితేనే కమిషనర్ గా ఎక్కువ కాలం పని చేయొచ్చు.. లేదంటే వచ్చిన దారిని వెళ్తున్నారు. రామగుండం కార్పొరేషన్ కమిషనర్ గా వచ్చిన సిహెచ్ శ్రీకాంత్ ఆరు నెలలు తిరక్క ముందే సెలవు పై వెళ్లి అటు నుంచి అటే బదిలీ చేయించుకున్న సంఘటన ఎందుకు అర్థం పడుతుంది.
ఇన్చార్జి కమిషనర్లే దిక్కు…
రామగుండం నగరపాలక సంస్థకు గత 15 ఏళ్ల నుంచి ఇన్చార్జి కమిషనర్ లో దిక్కు అవుతున్నారు. ఎందుకంటే పూర్తి అవినీతి కూపంగా మారిన ఇక్కడి కార్పొరేషన్ లో కమిషనర్ గా వచ్చిన అధికారి కట్టడి చేయలేకపోతున్నారు. ఇక్కడి రాజకీయాలను చూసి ఎలాగోలా పైరవీలతో బదిలీ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జి కమిషనర్ గా ఉన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీ అటు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో.. ఇటు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఒకేసారి రెండు వెదురు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పౌర సేవలు కూడా స్తంభించబోతున్నాయి. ఇక్కడి కార్యాలయంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు కనిపిస్తుంది. విధులకు హాజరైన ఉద్యోగులు, అధికారులు కాలక్షేపంగా ముచ్చట్లతో గడిపి సమయం కాగానే ఇంటికి వెళుతుంటారు. వీరి వీధులను పర్యవేక్షించాల్సిన కమిషనర్, మేయర్ లు అందుబాటులో ఉండకపోవడంతో ఉద్యోగులు ఆడిందట పాడింది పాటగా నడుస్తుంది. ఇదిలా ఉంటే రామగుండం కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ అయినప్పటి నుంచి కమిషనర్ సీటు ఇక్కడ ఎవరికీ కలిసి రావడం లేదు. తొలి కమిషనర్ గా ప్రభాస్ కుమార్ 2010లో విధుల్లో చేరి కేవలం రెండు నెలలకే బదిలీ చేయించుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రభువర్దన్ రెడ్డి కమిషనర్ గా వచ్చిన పది రోజులకే బదిలీపై వెళ్లడం గమనార్హం. మూడో కమిషనర్ గా వచ్చిన సత్యనారాయణ కూడా ఆరు నెలల కంటే ఎక్కువ పని చేయలేదు. ఆ తర్వాత వచ్చిన శివకుమార్ సంవత్సరం పాటు పనిచేసే వెళ్లిపోయారు. 2021 సెప్టెంబర్ లో కమిషనర్ గా వచ్చిన నారాయణరావు కేవలం ఒకరోజు అంటే ఒక రోజే కమిషనర్ గా పనిచేశారు. గత ఏడాది ఆగస్టులో కమిషనర్ గా వచ్చిన నాగేశ్వరరావు ఆరు నెలలు కొనసాగి బద్రి చేయించుకున్నారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిన రంగారెడ్డి నుంచి వచ్చిన సిహెచ్ శ్రీకాంత్ ఆరు నెలలు పనిచేసే… ఈ రామగుండం నాకొద్దు అంటూ సెలవు పై వెళ్లి… అటు నుంచి అటే వేరే చోటకు బదిలీ చేయించుకున్నారు. ఇలా రామగుండంకు ఎవరు కమిషనర్ గా వచ్చిన ఎక్కువ రోజులు ఎవరు ఉండలేని పరిస్థితి నెలకొంది. రామగుండం కమిషనర్ గా రావాలంటేనే ప్రభుత్వ అధికారులు భయపడే పరిస్థితి నెలకొంది.




