Sunday, September 8, 2024

ఇంటింటికి రామయ్య అక్షతలు

- Advertisement -

ఇంటింటికి రామయ్య అక్షతలు

కరీంనగర్, జనవరి 6

ఇప్పుడు, ఏ వీధిలో చూసినా రామనామమే మారుమోగుతుంది.. ఈ నెల 22న అయోధ్యలో… రాముడి గ్రహాన్ని ప్రతిష్టిస్తున్న నేపథ్యంలో… ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి హిందూ సంస్థలు… ఆయోధ్య నుంచీ తీసుకొచ్చిన.. అక్షింతలను.. ఇంటి… ఇంటికి తీసుకెళ్లి భక్తులకు ఇస్తున్నారు. డప్పు, చప్పుళ్ల మధ్య ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. అక్షింతలతో పాటు… అయోధ్య రామాలయ ఫోటో కూడా భక్తులకు అందజేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో… అయోధ్య రాముడి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.. ఈ నెల 22న అయోధ్య రామాలయం ప్రారంభమవుతున్న సందర్భంగా… పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయోధ్య నుంచీ తీసుకొచ్చిన అక్షింతలను… ఇంటి…. ఇంటికి వెళ్లి ఇస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.. ప్రతి దేవాలయం నుంచీ, ఈ ఊరేగేంపు మొదలవుతుంది… అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అక్షింతలను ఇస్తున్నారు.. పెద్ద ఎత్తున శోభయాత్ర నిర్వహిస్తున్నారు.. పార్టీలకు అతీతంగా . పలువురు నేతలు కూడా పాల్గొంటున్నారు.. ముఖ్యంగా మహిళలు.. పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.. ఈ నెల 15 వరకు.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. 22వ తేదీన… ఆలయాల్లో… అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.. ప్రతి ఒక్కరు.. ఇంట్లో వంట చేసుకోకుండా.. ఆలయం లో తినేందుకు ప్లాన్ చేస్తున్నారు… అదే విధంగా ప్రతి ఇంటి గోడకు జైశ్రీరామ్ అనే నినాధాల వాల్ రాయిటింగ్ చేస్తున్నారు.. ప్రతి ఇంటిపైన కాషాయ జెండాను ఏర్పాటు చేస్తున్నారు… అంతేకాదు.. రామాలయాల్లో ఉదయం, సాయంత్రం… భజన కార్యక్రామాలు నిర్వహిస్తున్నారు.అక్షింతల కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిస్తున్నారు.. హనుమాన్ భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఇంటికి అక్షింతలు తీసుకరావడంతో మహిళలు.. మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు.. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు… సాయంత్రం పూట… ప్రత్యేక శోభయాత్రలు నిర్వహిస్తున్నారు….

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్