Sunday, September 8, 2024

కాంగ్రెస్ గూటికి రమేష్ రాధోడ్

- Advertisement -

కాంగ్రెస్ గూటికి రమేష్ రాధోడ్
అదిలాబాద్, ఏప్రిల్ 15
సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంఛార్జి మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ముందుకు సాగుతున్నారు. మంత్రి సీతక్క అధ్వర్యంలో ఇటివలే సిర్పూర్ (టి) మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే తరహాలో జిల్లాలో వివిధ పార్టీల నాయకులు, ఎంపిపిలు, జడ్పిటిసిలు, మున్సిపల్ చైర్మన్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో చేరికల పరంపర పెరిగింది. బోథ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ తాజాగా సోమవారం సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగిన బాపురావ్ ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరి వెనువెంటనే బీజేపీలోకి మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ తరువాత ఎంపి టికెట్ కోసం ప్రయత్నం చేశారు. ఎంపి టికెట్ సైతం గోడం నగేష్ కు కేటాయించడంతో బిజెపిలో ఎలాంటి ఆదరణ లేకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆడే గజేందర్, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు కుచాడి శ్రీహరిరావ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ సైతం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగడంతో పార్టీలో మంచి జోష్ కనిపిస్తోంది. అనుకున్న స్థాయిలో పార్లమెంటు ఎన్నికల్లో అధిక సీట్లు గెలుపొందే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క చక్రం తిప్పుతున్నారు. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం సైలెంట్ గానే ఉన్నారు. సిర్పూర్ (టి) మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేరిక తర్వాత ఆయన జానారెడ్డి తో చర్చలు జరిపి పార్టీలో చేరేందుకు సిద్ధంకాగా.. నిర్మల్ డిసిసి అధ్యక్షుడు శ్రీహరిరావ్ తన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో ఇంద్రకరణ్ రెడ్డిని చేర్చుకోవద్దంటూ ఆందోళనలు చేశారు. కాంగ్రెస్ హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అప్పటినుండి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేరికకు గ్యాప్ వచ్చింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ముధోల్, నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్(టి) నాలుగు నియోజకవర్గాల్లో బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాలు కైవసం చేసుకోగా.. బిఆర్ఎస్ 2స్థానాలు, కాంగ్రెస్ ఒక స్థానంలో నిలిచింది. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని డి కొట్టడానికి, ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పుతు కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు చేపడుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి లు సైతం నేడో రేపు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్