Sunday, September 8, 2024

కరీంనగర్ అపోలో రీచ్ హాస్పిటల్లో అరుదైన శస్త్ర చికిత్స

- Advertisement -

కరీంనగర్ అపోలో రీచ్ హాస్పిటల్లో అరుదైన శస్త్ర చికిత్స
కరీంనగర్

ఉత్తర తెలంగాణలో ప్రధాన పట్టణమైన కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల అపోలో రీచ్ హాస్పిటల్ మరొకసారి అరుదైన శస్త్ర చికిత్సలకు  వేదికగా మారింది.
వివరాలలోకి వెళితే మల్యాల మండలానికి చెందిన పోచంపల్లి రాజ మల్లయ్య అనబడే 68 సంవత్సరాల వృద్ధుడు  గత కొంతకాలంగా చాతిలో నొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతున్న సందర్భంగా అపోలో రీచ్ హాస్పిటల్ కరీంనగర్లోని  కార్డియో తురాసిక్ మరియు వాస్కులర్ సర్జన్  డాక్టర్ సంతోష్  దంగేటి గారిని సంప్రదించగా  వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తన గుండెలోని ప్రధాన రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోవడం జరిగిందని  పి.టి.సి.ఏ మరియు స్టెంటింగ్ ద్వారా ఫలితాలు అంతగా ఆశాజనకంగా ఉండవని ఓపెన్ హార్ట్ సర్జరీ అనగా సి.ఏ.బి.జి.  సిఫార్సు చేయడం జరిగింది. రోగి యొక్క   వయస్సు దృష్టియా  మొదట కుటుంబ సభ్యులు సి.ఏ.బి.జి లాంటి పెద్ద సర్జరీలకు మరియు  రోగి యొక్క చాతిని పూర్తిగా కత్తిరించి, తెరిచి గుండెపై నిర్వహించే  బైపాస్ గ్రాఫ్టింగ్ కు గల కొన్ని అనివార్యమైన  దుష్పరిణామాలు వైద్య పరంగా ఉన్న ఎడల రోగికి కుటుంబ సభ్యులు సుముఖత  ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించడానికి తెలుపలేదు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్ దంగేటి గారు మిక్స్  (మినిమల్ ఇన్వాసివ్ కార్డుయోతురాసిక్ సర్జరీ)  ద్వారా చాతిపై చిన్నపాటి కోతతో శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
డిసెంబర్ 28న శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించగా రోగి పూర్తిగా కోలుకోని  మంగళవారం రోజున డిశ్చార్జ్ చేయడం జరిగింది.  ఈ సందర్భంగా సి.టీ.వీ.ఎస్ అండ్ మిక్స్ సర్జన్ డాక్టర్ సంతోష్ గారు మాట్లాడుతూ  హైదరాబాద్ లాంటి ప్రధాన పట్టణాలకే పరిమితమైన మరియు దేశవ్యాప్తంగా  అతికొద్ది మంది మాత్రమే నిర్వహించగలిగిన మిక్స్ టెక్నిక్ ద్వారా సి ఏ బి జి కరీంనగర్ లాంటి రెండవ తరగతి పట్టణాలలో కూడా  అపోలో రీచ్ హాస్పిటల్ వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని హాస్పిటల్ పరిపాలకులు డాక్టర్ నాగ సతీష్  మాట్లాడుతూ  గుండె వైద్యానికి సంబంధించి ఉత్తర తెలంగాణలో అగ్రగామి అయిన అపోలో రిచ్ హాస్పిటల్  కాలం మరియు సాంకేతికతతో పోటీపడుతూ ఎప్పటికప్పుడు అత్యున్నత వైద్య విధానాలు మరియు రోగికి ఆర్థికంగా అందుబాటులోకి ఉంచడం జరుగుతుందని తెలియజేసినారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్