Saturday, February 14, 2026

 బన్నీకి విలన్ గా రష్మికా

- Advertisement -

 బన్నీకి విలన్ గా రష్మికా

Rashmika as Bunny’s villain
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా   మూవీ  హాట్ టాపిక్గా మారింది. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్కి టాప్ నాచ్ టెక్నికల్ టీమ్ పనిచేస్తున్నారు. హాలీవుడ్ స్థాయికి తగ్గ వీఎఫ్ఎక్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్లు, సైన్స్ ఫిక్షన్ అంశాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా ఖరారవ్వడంతో మూవీపై క్రేజ్ మరింత పెరిగింది. అల్లు అర్జున్ ఇందులో రెండు డిఫరెంట్ రోల్స్లో కనిపించనున్నాడన్న ప్రచారం సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. అల్లు అర్జున్ – రష్మిక కాంబో అంటేనే బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్ అయింది. వీరిద్దరూ కలిసి నటించిన పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్ సినిమాలు బ్లాక్బస్టర్లుగా నిలిచి రికార్డులు సృష్టించాయి. అలాంటి హిట్ జోడీ ఇప్పుడు మరోసారి కలిసి నటిస్తుండటం ఒక ఎత్తైతే, ఈసారి రష్మిక… అల్లు అర్జున్కు విలన్గా కనిపించనుందన్న టాక్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ అల్లు అర్జున్తో ఆడిపాడి రొమాన్స్ చేసిన ఈ నేషనల్ క్రష్ ఇప్పుడు ఆయనకు విలన్గా నటిస్తూ ఫైట్లు చేస్తుందని తెలియగానే అభిమానులు కొత్త అనుభూతికి లోనవుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్