రాయలసీమ బలిజ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి
నెల్లూరు
రాయలసీమ బలిజ ఆత్మగౌరవ సభను ఈనెల 25న నెల్లూరు నగరంలోని స్థానిక పుర మందిరంలో ఘనంగా నిర్వహించబడుతుందని, ఈ కార్యక్రమానికి బలిజ సంఘీయులు పాల్గొని విజయవంతం
చేయాలని బలిజ ఆత్మగౌరవ ప్రతినిధులు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం విలేకరుల సమావేశం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్
నందు కాపునాడు, రాయలసీమ బలిజ ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ, పేద మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు, బలిజ కులస్తులకు
ప్రతిభా పురస్కారాలు, సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. వంగవీటి రంగ వర్ధంతి, మిరియాల వెంకట్రావు జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు
ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ, బత్యాల చెంగల్ రాయుడు, ఆమంచి స్వాములు, పసుపులేటిహరి ప్రసాద్, తాతంశెట్టి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా లోని బలిజ
కుటుంబీకులు సకుటుంబ పరివారంగా విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సంపత్ హనుమంతరావు, వెలిశెట్టి శ్రీహరి రాయలు, ఉమ్మడిశెట్టి
కొండలరావు, హనుమంతు, లక్కాకుల శ్రీనివాసులు, శ్రీధర్, మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు.



