9.5 C
New York
Thursday, April 18, 2024

#RC16 హీరోయిన్ గా సెలెస్టియల్ బ్యూటీ జాన్వీ కపూర్‌

- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన, వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పాన్ ఇండియా ఫిల్మ్ #RC16 హీరోయిన్ గా సెలెస్టియల్ బ్యూటీ జాన్వీ కపూర్‌

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ పాన్ ఇండియా చిత్రం #RC16 కోసం ఉప్పెన ఫేమ్ యంగ్ ట్యాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానతో చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై హై బడ్జెట్‌తో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో గ్రాండ్‌గా చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు.ఈ చిత్రం కోసం సెలెస్టియల్ బ్యూటీ జాన్వీ కపూర్‌ ను, ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్వాగతం పలికారు. ఈ జోడి తెరపై అద్భుతమైన కెమిస్ట్రీతో ప్రేక్షకులని మంత్రముగ్దులను చేయబోతోంది.ఈ మెగా వెంచర్‌కి, ఆస్కార్- విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.బుచ్చిబాబు యూనివర్సల్ అప్పీల్ ఉండే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.
తారాగణం: రామ్ చరణ్, జాన్వీ కపూర్

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!