Saturday, February 14, 2026

సీఎం ఆదేశిస్తే రాజీనామాకు సిద్దం

- Advertisement -

సీఎం ఆదేశిస్తే రాజీనామాకు సిద్దం
ఎమ్మెల్యే దానం
హైదరాబాద్

Ready to resign if ordered by the CM
ఎన్నికల్లో ఫైట్ చేయడం , గెలవడం తన రక్తంలోని ఉందని దానం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అనర్హత వేటు అంశంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని , ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని దానం అన్నారు. తనకి ఎన్నికలు కొత్త కాదని , ఇప్పటికి 11 ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర తనకి ఉందన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ లోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన దానం నాగేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయని , తన వైపు నుండి వాదనలు వినిపిస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పధంలో దూసుకెళ్తుందన్నారు. రైజింగ్ తెలంగాణ కోసం తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తుందని దానం అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్