- Advertisement -
- రియల్ వ్యాపారులు ప్రభుత్వ భూమిని అమ్మకుండా నిలిపివేయాలి.
ప్రభుత్వ భూమిని ఫారం ల్యాండ్ చేసి గుంటలుగా అమ్ముతున్నారు.
వాయిస్ టుడే మహబూబ్ నగర్ జిల్లా
జూన్.25
రాజపూర్ మండల పరిధిలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న 74 సర్వే నంబర్ లో 8ఎకరాల ప్రభుత్వ భూమిని ఫారం ల్యాండ్ చేసి గుంటలుగా విక్రయాలు చేసే నర్సింహ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోస్గి వెంకటయ్య అనే సామాజిక కార్యకర్త హైదరాబాద్ లోని సెక్రటేరియట్ ప్రజా దర్బార్ లో ఫిర్యాదు చేశారు .ఆ విషయం పై సంబంధించిన అధికారులకు సమాచారం అందించిన చర్యలు తీసుకుంటామని చెప్పారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని అన్నారు.ప్రభుత్వ భూమిని అమ్మకుండా నిలిపివేయాలి అని అధికారులే భాద్యతలను తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- Advertisement -