Sunday, September 8, 2024

భగవద్గీత పఠనం తో మానసిక ప్రశాంతత కలుగుతుంది

- Advertisement -

భగవద్గీత పఠనం తో మానసిక ప్రశాంతత కలుగుతుంది
– గీతా ప్రబోధక్ చిలమంతుల ఛత్రపతి
గీత  జ్ఞాన మహాయజ్ఞ పరిసమాప్తి మహోత్సవమ్
108 రకాల నైవేద్యాల సమర్పణ
మెట్ పల్లి

Recitation of Bhagavad Gita brings peace of mind

మెట్ పల్లి పట్టణంలో జరిగిన 78 వ గీతా జ్ఞాన మహాయజ్ఞం పరిసమాప్తి సందర్బంగా  భగవద్గీత పఠనంతో మానసిక ప్రశాంతత కలుగుతుందని గీతా ప్రభోదక్ చిలమంతుల ఛత్రపతి తెలిపారు. పట్టణంలోని బస్ డిపో దగ్గర్లో గల అమృత టవర్స్ లో 78 వ గీతా జ్ఞాన మహాయజ్ఞం జులై ఒకటవ తేదీన ప్రారంభమై, జులై 13 శనివారం రోజున ముగిసింది. భగవద్గీత శ్లోకాల ప్రతి పదానికి అర్థాన్ని వివరించి బోధనలు చేశారు. ఈ సందర్బంగా గీతా ప్రబోధక్ మాట్లాడుతూ, శ్రీకృష్ణ భగవానుడు కేవలం అర్జునునికి మాత్రమే భగవద్గీతను ఉపదేశించాలేదని, అర్జునుడు నిమిత్తమాతృడని, సకల లోకాలకు బోధించాడని తెలిపారు. ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలని, పిల్లలకు కూడ అందులోని శ్లోకాలను వివరించి చెప్పాలని, అపుడే వారు పెద్దలపట్ల గౌరవం, భక్తి భావనతో ఉంటారని అన్నారు. పిల్లలలోని భౌతిక, ఆధ్యాత్మిక చింతనలో ఎదుగుదలకై గీతాపఠనం చాలా ప్రోత్సాహకరంగ ఉంటుందని అన్నారు.  కుటుంబంలోని ప్రతి ఒక్కరు గీతా పారాయణం చేయాలని, దీని ద్వారా ఎన్నోరకాల మానసిక బాధలు తొలిగి ప్రశాంతత వస్తుందని, ఇంటిల్లిపాది ఆనందనతో ఉంటారని, పిల్లల భవిష్యత్తు విద్య, ఉద్యోగంలో మంచి మార్గంలో ఉంటారని ప్రభోదించారు. తదనంతరం గీతా జ్ఞానాన్ని సకల లోకానికి పంచిన శ్రీకృష్ణ పరమాత్మునికి 108 రకాల నైవేద్యాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో దొంతుల రాజకుమార్, కౌన్సిల్లర్ చెట్లపల్లి మీనా, సుఖీందర్ గౌడ్, మర్రి భాస్కర్, పోలీస్ శ్రీనివాస్, రాంభూపాల్, మహాజన్ శివకుమార్, మహాజన్ హరీష్, గాదె రమేష్ మరియు సుమారు 300 మంది్గీత జ్ఞానం పొందిన సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్