- Advertisement -
కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయండి
Regularize contract faculty
హైదరాబాద్:
కాంట్రాక్ట్ అధ్యాపకులను సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని చేయాలని ఒకవేళ రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ ఆలస్యం అయితే బేసిక్, డి ఎ, హెచ్ఆర్ మరియు 3% తో కూడిన స్కేల్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాసబ్ ట్యాంక్ ఉన్నత విద్యా మండలి ఎదుట 12 యూనివర్సిటీలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు మహాధర్నా నిర్వహించారు. 10 నుండి 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని నమ్ముకొని ఉంటున్నతమణి ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన పిమ్మటే నోటిఫికేషన్లు విడుదల చేయాలని లేని పక్షంలో కాంట్రాక్టు ఉద్యోగులు మరియు వారి కుటుంబాలు రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. దేవుడు కరుణించిన పూజారి వరమీయ లేనట్లు సీఎం రేవంత్ రెడ్డి చేస్తామని అన్నా కూడా ఉన్నత విద్యా మండలి అధికారులు సరిగ్గా పట్టించుకోవడంలేదని నిరాశ వ్యక్తం చేశారు.
- Advertisement -