- Advertisement -
వైరా మండలం లో మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాలి
Remaining grain should be purchased in Vaira Mandal
రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఆదేశించినా కొనుగోలు లేదు
రైతులు నిరసన
వైరా
వైరా మండలం లో విప్పలమడక, సిరిపురం గ్రామాలలో మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు.
చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని మంత్రులు ప్రకటించిన అధికారులు కొనుగోలు చేయడం లేదని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. మంగళవారం వైరా మండలం విప్పల మడక గ్రామం లో ధాన్యం రాశులు వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాసులు జనవరి 31 వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది చివరి తేదీ గడువు కంటే నాలుగు రోజుల ముందుగానే కొనుగోలు నిలుపుదల చేశారు అని అన్నారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో వరి నాట్లు అలస్యం కావడం వల్ల వరి కోతలు జనవరి రెండవ వారం లోకూడా జరిగాయి అని అన్నారు. మిగిలిన ధాన్యం కొనుగోలు సమస్య పై జిల్లా కలెక్టర్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ దృష్టి కి రైతులు తీసుకువచ్చారు అని ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అధికారులను రెవెన్యూ మంత్రి అందేశించిన ధాన్యం కొనుగోలు జరగడం లేదని అన్నారు ,మరో వారం రోజులు ధాన్యం కొనుగోలు గడువు ఇచ్చినట్లయితే కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుంది అన్నారు, ఈ కార్యక్రమంలో విప్పలమడక మాజీ సర్పంచ్లు పారుపల్లి కృష్ణారావు, తుమ్మల జాన్ పాపయ్య, రైతు సంఘం మండల అధ్యక్షులు మేడా శరబంధి, ఎస్ కె జానిమీయా, నీటి సంఘం మాజీ అధ్యక్షులు కొల్లా వెంకటేశ్వరరావు, రుద్రాక్షల వెంకటయ్య, దెవభక్తిని అర్జున్ రావు, భద్రయ్య, మురళి, సాంబశివరావు, రామారావు, పుల్లారావు, రైతులు పాల్గొన్నారు
- Advertisement -