ఫార్మసిస్టులు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
Dr. గంప విజయ్ కుమార్ ఫార్మసీ కాలేజి ప్రొఫెసర్ తెలంగాణ ఫార్మసీ అనుబంధ సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షులు,ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్, అసోసియేషన్ ఆఫ్ కమ్యూనిటీ ఫార్మసిస్ట్స్ ఆఫ్ ఇండియా, కోశాధికారి, తెలంగాణ రాష్ట్ర, ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్
ఫార్మసి కౌన్సిల్ తరలించినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఫార్మసీ చదివిన విద్యార్థులు సర్టిఫికెట్లు రెన్యువల్ కోసం గుంటూరు వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ప్రయాసపడ్డ విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. 9 సంవత్సరాలకు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఏర్పడబోతున్నది, కావున ఫార్మసి విద్యను పూర్తి చేసిన వారందరూ రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఈనెల 31 లోగా చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. మీ ఒక్క ఓటు తో సరైన ఫార్మసీ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకొని ఫార్మసిస్టు సమస్యలను తీర్చే గొప్ప అవకాశం ఉంటుందన్నారు. మీ ఓటు తో 6 గురు ఫార్మసీ కౌన్సిల్ సభ్యులను ఎన్నికోవచ్చును అని తెలిపారు. అంచేత ఈ నెల 31 లోగా అందరు రిజిస్ట్రేషన్ చూసుకోవాలని సూచించారు.



