క్వాంటం AI గ్లోబల్‌తో కలిసి కొత్త AI కంపెనీని లాంచ్ చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు
Renowned producer Dil Raju launches new AI company in collaboration with Quantum AI Global
ప్రముఖ చిత్ర నిర్మాత దిల్ రాజు క్వాంటం AI గ్లోబల్‌తో చేతులు కలిపి కొత్త AI ప్రోడక్ట్ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ సినిమాలు, ఎంటర్టైమెంట్ ఇండస్ట్రీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఆర్టిఫిషియల్ ఇంటెల్జెన్స్ ని ఉపయోగించి స్మార్ట్ టూల్స్ రూపొందించడంపై దృష్టి పెడుతుంది.AI-ఆధారిత సాధనాలు అందించడం ద్వారా కంటెంట్ క్రియేటర్స్, స్టూడియోలు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు సహాయం చేయడం, స్క్రిప్ డెవలప్మెంట్, ప్రీ విజువలైజేష్, ఎడిటింగ్, ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే క్రియేట్ ప్రోసస్ లో ప్రతి భాగానికి మద్దతు ఇవ్వడం దీని లక్ష్యం, ఆటోమేషన్, స్మార్ట్ AI ఉపయోగించడం ద్వారా, ఈ కొత్త వెంచర్ కథలను సృష్టిండం, ఆస్వాదిండం విప్లవాత్మక మార్పుకు నాంది కానుంది. కంపెనీ పేరు, ప్రొడక్ట్స్ లిస్టు, లాంచ్ వివరాలు మే 4, 2025న తెలిజేస్తారు.
ఈ సందర్భంగా దిల్ రాజు తన ఆలోచనలు పంచుకున్నారు.“ఇది కేవలం మెరుగైన కంటెంట్ గురించి మాత్రమే కాదు, మొత్తం ఎంటర్టైమెంట్ వరల్డ్ కి మద్దతు ఇచ్చే బలమైన AI వ్యవస్థ నిర్మాణం గురించి. క్వాంటం AI గ్లోబల్ సాంకేతిక నైపుణ్యాలతో, సృజనాత్మకత ఎలా పనిచేస్తుందో మార్చే శక్తివంతమైన, ఫ్యూచర్ కి రెడీగా వున్న సొల్యుషన్స్ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాము’అన్నారు.