- Advertisement -
బోర్లు, మోటార్లు మరమ్మత్తులు చేయండి–కమిషనర్ ఎన్.మౌర్య
Repair bores and motors--Commissioner N. Maurya
తిరుపతి,
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీరు అందించే బోర్లు, మోటార్లు మరమ్మత్తులు చేసి ప్రజలకు సమృద్ధిగా నీరు అందించాలని కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం నగరంలో 48, 49 వార్డులైన జీవకోన, రాజీవ్ గాంధీ కాలని, రాఘవేంద్ర కాలని, లెప్రసి కాలని, కూరపాటి లే ఔట్ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్లు అన్నా అనిత, అన్నా సంధ్య, అనిల్ కుమార్, ఆరోగ్య శాఖ, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలసి తనిఖీలు చేశారు. పలు చోట్ల నీరు రావడం లేదని, పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా బోర్లు, మోటార్లు మరమ్మత్తులు చేయించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే మురుగు కాలువలు లేకుండా ఉన్న ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసేందుకు, మరమ్మత్తులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. శ్మశానం శుభ్రంగా ఉంచాలని, గేట్ ఏర్పాటు చేసి ఆకతాయిలు రాకుండా పటిష్ట ఏర్పాట్లు చేయిస్తామని అన్నారు. రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇచ్చేలా, బహిరంగ మూత్ర విసర్జన చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి రవి, ఏసిపి బాలాజి, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి, తదితరులు ఉన్నారు.
- Advertisement -