Thursday, March 20, 2025

రోడ్లు బాగు చేయండి మహాప్రభో…

- Advertisement -

రోడ్లు బాగు చేయండి మహాప్రభో…

Repair the roads Mahaprabho...

విజయనగరం, ఆగస్టు 29 (న్యూస్ పల్స్)
నిత్యం వేలాది లారీలు. వందలకొద్దీ కార్లు ఆటోలు ప్రయాణికులు నిత్యవసర వస్తువుల కోసం వెళ్లే వాహనదారులు ఆంధ్ర ఒడిస్సా చత్తిస్ గఢ్ రాష్ట్రాలకు వెళ్లే రోడ్డులో నరకయాతన అంటే ఏంటో చూస్తున్నారు.   పార్వతీపురం నుండి ఒడిస్సా చెక్‌పోస్ట్ వరకు వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి ఘోరంగా మారింది.   దారి మధ్యలో సరుకులు తీసుకెళుతున్న లారీలు ఎన్నో రిపేర్లతో సతమతమవుతున్నాయి. ప్రయాణం చేయాలంటే చాలు ప్రాణాలు పోతున్నాయి అంటున్నారు.చెక్ పోస్టుల   వద్ద టాక్స్ కట్టించుకుంటున్నారు కానీ ఈ రోడ్డు నిర్మాణం మాత్రం జరగడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా చేస్తామని చెబుతూంటారు కానీ  నేటికీ  పరిష్కారం కాలేదు. సాధారణంగా ఒక లారీ లోడు ఒడిస్సా తీసుకెళ్లాలి అంటే ఆంధ్ర నుండి 30 వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు.  కానీ ఒడిస్సా రోడ్ వరకు వెళ్లాలంటే 60, 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ రోడ్లు పరిస్థితి అలా ఉన్నాయి కనుక డబుల్ చార్జ్ చేస్తున్నామని లారీల యజమానులు చెబుతున్నారు. అలా అయితేనే లోడ్ ఎక్కిస్తాం లేదంటే ఎక్కించమని చెబుతున్నారు.ఇక వర్షం పడితే అది రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. కొంతమంది నాయకులు ఎన్నోసార్లు రకరకాల హామీలు ఇచ్చినప్పటికీ  ఫలితం మాత్రం శూన్యం. ప్రతిసారి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఈ రోడ్డు ప్రతిపానలో పెట్టండి అయిపోతుందని అధికారులకు చెప్పి వెళ్లిపోతున్నారు. కానీ పని మాత్రంమ జరగడం లేదు.  పార్వతీపురం జిల్లా నుండి ప్రారంభమై ఒడిస్సా బోర్డర్ కు చేరుకోవాలంటే సుమారు 42 కిలోమీటర్లు ఉంటుంది.  అందులో 27 కిలోమీటర్లు గుంతలతో ఏర్పడిన రోడ్డుతో వాహనాలు ఇక్కట్లు భయంకరంగా ఉంటాయి.  ఒక రోజులో వెళ్లి వస్తాము అనుకుని బయలుదేరితే ఎప్పటికి వస్తారో చెప్పలేని పరిస్థితి.  రోడ్లు  బాగోలేకపోవడంతో తమ రాష్ట్ర ట్రాన్స్ పోర్టర్లు ఇబ్బంది పడుతున్నారని  ఒడిస్సా గవర్నమెంట్ కూడా అసహనం వ్యక్తం చేస్తోంది.  ఒడిస్సా లారీ యూనియన్ కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5వ తారీఖు వరకు సమయం ఇస్తున్నాం ఆ ప్రభుత్వానికి రోడ్లు మరమ్మతులు గాని చెయ్యకపోతే ఇక ఆంధ్రాలోకి ఎటువంటి లారీలు కూడా వాహనాలను కూడా అనుమతించేది లేదని ప్రకటించారు.   ఇప్పటికే అన్ని యూనియన్లతో కూడా మేము సంప్రదింపులు చేసి ఈ నిర్ణయానికి వచ్చామని ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు నివేదికలు ఇచ్చిన పట్టించుకునేవారని వాపోతున్నారు. రోడ్లను మరమ్మతు చేయకపోతే ఏ ఒక్క వాహనం కూడా ఒడిస్సా బోర్డర్ దాటి ఆంధ్రాలోకి అడుగుపెట్టే పరిస్థితి రానివ్వమని హెచ్చరిస్తున్నారు.  ప్రభుత్వం ఇప్పటికైనా  స్పందించాలని  కోరుతున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్