
వరదలపై నిరంతర పర్యవేక్షణ
డీజీపీ అంజనీకుమార్
హైదరాబాద్: తెలంగాణా లో చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రతి జిల్లా నుండి వర్షాలు పై పర్యవేక్షణ చేస్తున్నాం. అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, గ్రే హౌండ్స్ , ఇతర అధికారులు డీజీపీ కార్యాలయం నుండి పర్యవేక్షణ చేస్తున్నామని డీజీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. 2900 మందిని రెస్క్యూ చేసి, పునరావాస కేంద్రంకు తరలించాం. మోచన్ పల్లి వరదలకు చిక్కుకున్న వారిని 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ తో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాం. అత్యవరసర సమయాల్లో మాత్రమే పబ్లిక్ బయటకి రావాలి . హైదరాబాద్ మూడు కమిషనరేట్ లలో పరిస్థితి అదుపులో ఉంది . ముసారాం బాగ్ బ్రిడ్జ్ పై వరద నీరు కూడా కంట్రోల్ లో ఉంది. పిల్లలు పై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. సెల్ఫీ లు తీసుకోవడానికి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. సెల్ఫీ లు తీసుకోవడానికి బయటకి రావొద్దు. విద్యుత్ స్తంభాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం. 24 పాటు డీజీపీ కార్యాలయం లో రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని సమీక్షిస్తున్నామని అయన అన్నారు.