Sunday, September 8, 2024

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత దివంగత ఎస్.పాండురంగా రావు కుటుంబ సభ్యులు ఆయన కుమారుడు మాజీ యువజన కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎస్.పి.క్రాంతి కుమార్, హైదరాబద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఎస్.శైలజ దంపతులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

Resignation from Congress party..
Resignation from Congress party..

కాంగ్రెస్ లో 1979లో చేరిన నాటి నుండి మరణం 2001 వరకు, తన తండ్రి ఎస్.పాండురంగా రావు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేశారని, 1994 లో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమి చెందిన తన తండ్రి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేశారని గుర్తుచేశారు.
తను 2002 నుండి కాంగ్రెస్ పార్టీలో ఎస్.ఎస్.యూ.ఐ, యువజన కాంగ్రెస్ లో అసెంబ్లీ, నగర, రాష్ట్ర కమిటీ లో వివిధ హోదాలో పనిచేయడం జరిగిందని, తనతో పాటు తన భార్య ఎస్.శైలజ 3 సార్లు యువజన కాంగ్రెస్ ఇంటర్నల్ ఎలక్షన్స్ లో పాల్గొని ఎన్నికై, ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఊపాధ్యక్షురాలిగా పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తూ వచ్చామని తెలిపారు.
కాంగ్రేస్ పార్టీ బలోపేతం కోసం తమ కుటుంబం నాలుగు దశాబ్దాలుగా పని చేస్తూ వస్తున్నమని కానీ ప్రస్తుత తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుణ్యమా అని టి-కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ గా మారిందని, ఎన్నో ఏండ్ల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నాయకులకు కానీ, బీసీ నాయకులకు కానీ, యువజన కాంగ్రెస్ నాయకులకు కానీ పార్టీ టికెట్స్ ఇవ్వకుండా సర్వేల పేరిట మాజీ టీడీపీ నాయకులకు, పారాచూట్లకు పెద్ద పీట వేయడం, కాంగ్రెస్ సిద్దాంతాలు తెలియని వారికి కూడా టికెట్ లు ఇవ్వడం బాధాకరమని, ఆయన పారాసైట్ గా అస్సలు కాంగ్రెస్ నాయకులకి అన్యాయం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
తాము 2014, 2018 ఎన్నికలో చాంద్రాయణగుట్ట నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించడం జరిగిందని, కానీ ఈ సారి ఎన్నికల్లో తాము పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేయలేదని స్వస్టం చేశారు.
త్వరలో తన రాజకీయ భవిషత్ పై శ్రేయోభిలాషులతో కలసి నిర్ణమం తీసుకోవడం జరుగుతుందని క్రాంతి కుమార్ తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్