Sunday, September 8, 2024

ఆరు నెలల్లో కొత్తగా 12,905 కోట్ల రూపాయల అప్పు చేసిన రేవంత్ ప్రభుత్వం:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కోరిన ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

- Advertisement -

ఆరు నెలల్లో కొత్తగా 12,905 కోట్ల రూపాయల అప్పు చేసిన రేవంత్ ప్రభుత్వం
ఎఫ్అర్బిఎం పరిమితి గరిష్ట స్థాయికి చేరుకుంది
కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేసి భారీ స్థాయిలో రుణాలని పొందే ప్రయత్నం
అప్పులు కట్టడానికి మరిన్ని కొత్త అప్పులు చేయవలసిన దుస్థితి
ప్రభుత్వ  భూములు అమ్మటానికి ఇప్పటికే శ్రీకారం చుట్టారు
దుబారా గణనీయంగా పెరుగుతోంది
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం కోసం  రిజర్వ్ బ్యాంక్ ద్వారా కొత్త మార్గదర్శక సూత్రాలు రూపొందించండి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కోరిన ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్
న్యూ డిల్లీ మే 20
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ను సోమవారం  సాయంకాలం బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ,ఉప్పల్ మాజీ శాసనసభ్యుడు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్  న్యూఢిల్లీలో కలిశారు . ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సంబంధించిన అంశాలను పోలింగ్ శాతం వివరాలను వివరించి కనీసం 10 స్థానాల్లో భారీ మెజారిటీతో బిజెపి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని  వివరించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అనుకూల పవనాలు ఈసారి దక్షిణాదిలో కూడా చాలా బలంగా , గాలి వీస్తున్నది అని  సాధారణ పౌరులు మాట్లాడుకుంటున్న విషయాలని, వివరాలని వారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి  నాయకత్వంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం  ఆరు నెలలు తిరగకముందే  12,905 కోట్ల రూపాయల అప్పు కొత్తగా చేసిందని .FRBM  పరిమితి గరిష్ట స్థాయికి చేరుకుందని ప్రభాకర్ ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ ఏతర రుణాల మీద దృష్టి సారించిందని, బహిరంగ మార్కెట్లో రుణాలు సేకరించడానికి సిద్ధమవుతుందని ఆర్థిక మంత్రి దృష్టికి ప్రభాకర్ తీసుకుని వెళ్లారు. గత ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసి రుణాలు పొందగా, ఇప్పుడు ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేసి భారీ స్థాయిలో రుణాలని పొందటానికి ప్రయత్నం చేస్తుందని  వివరించారు. ఈ చర్యలు ఆర్థిక పరిస్థితిని మరింత దిగదారుస్తుందని .అప్పులు కట్టడానికి మరిన్ని కొత్త అప్పులు చేయవలసిన దుస్థితి  ఏర్పడింది  అని వారు వాపోయారు, ప్రభుత్వ  భూములు అమ్మటానికి ఇప్పటికే శ్రీకారం చుట్టారని మరిన్ని భూములు అమ్మడం కొరకు సిద్ధమవుతున్నారని తెలియజేశారు. రోజురోజుకీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు తగ్గుతున్నాయని ,అప్పులు మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయని  కేంద్ర ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం   నియమిస్తున్న  సలహాదారుల ,కార్పొరేషన్ చైర్మన్ ల రాజకీయ నియామకాలు ప్రభుత్వ ఖజానా గుల్ల అవుతుందని ,దుబారా గణనీయంగా పెరుగుతోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.   కేంద్ర ఆర్థిక సంఘం  స్థానిక సంస్థలకు అందిస్తున్న  నిధులను కూడా ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తూ స్థానిక సంస్థలను కూడా నిర్వీర్యం చేస్తున్న అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం  , ఆర్థిక క్రమశిక్షణ పాటించడం  కొరకు రిజర్వ్ బ్యాంక్ ద్వారా కొత్త మార్గదర్శక సూత్రాలు రూపొందించడం కొరకు ప్రయత్నించాలని కోరారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్