Wednesday, January 21, 2026

ఆదే మూర్ఖత్వం ప్రదర్శించిన రేవంత్ రెడ్డి

- Advertisement -

ఆదే మూర్ఖత్వం ప్రదర్శించిన రేవంత్ రెడ్డి
సూర్యాపేట

Revanth Reddy displayed the same stupidity.

హుజుర్నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై  మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ భాషలో ఎలాంటి మార్పు రాలేదు. సీఎం అనే సోయిలేకుండా దిగజారుడు వ్యాఖ్యలు.  ఆయన భాష తీరే ఆయనను బొందపెడుతుంది. ఆదే భాష అవే పదాలు.. ముఖ్యమంత్రి స్థాయి వచ్చిన మూర్ఖత్వం మారడం లేదని అన్నారు.
పచ్చి అబద్ధాలు.. అవే అర్థం లేని ఆరోపణలు. 15 నెలలు గడిచినా కేసీఆర్ మాట లేకుండా సభ సాగట్లేదు. సోనియా 6 గ్యారంటీలను నమ్మి ప్రజలు మోసపోయారు తప్ప రేవంత్ రెడ్డి మూర్ఖత్వపు మాటలకు కాదు . కాలేశ్వరాన్ని కెసిఆర్ కు అప్పగిస్తే మూడు రోజుల్లో నీళ్లు ఇచ్చి చూపిస్తామని చెప్పిన ఎలాంటి స్పందన లేదు. మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. పంట పొలాల వద్ద కన్నీరు పెడుతున్నరు. కడుపుమండిన రైతులు, మహిళలు ప్రభుత్వానికి, రేవంత్ కు శాపనార్ధాలు పెడుతుండ్రు. ప్రభుత్వం ఇస్తామన్న రుణమాఫీ లేదు.. రైతుబంధు లేదు.. బీమా లేదు.. ప్రతిదీ మభ్యపెట్టి మోసం చేశారు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందని అసలు ధాన్యమే కొనడం లేదు. ఉన్న ధాన్యం ఎంత అంటే ఎక్కడ సమాధానం లేదు.. ప్రతిపక్ష నాయకుల ఫోన్లను అధికారులు ఎత్తడమే లేదు. వాన కాలంలో ఏ పంట ఎంత కొన్నారు.. దొడ్డు రకానికి బోనస్ ఇస్తామని మాటమార్చి సన్నధాన్యానికి బోనస్ అన్నారు. ఎంత ధాన్యం కొన్నారు ఎంత బోనస్ ఇచ్చారు అంటే సమాధానం లేదు. నిన్న హుజూర్నగర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని ప్రదర్శించిండు. మళ్ళీ కెసిఆర్ ను తిట్టడం తప్ప వేరే పని లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విషం కక్కి ప్రజాక్షేత్రంలో బతకడం సాధ్యం కాదు. ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటారని తెలిసికూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజలు భయపడకుండా ఎండగడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉరివేస్తా అంటే ప్రజలే నీకు ఉరివేసే రోజులు దగ్గరపడ్డాయి. నీ గురించి ఒక్క రోజు కూడా మాట్లాడలేదు… కేసీఆర్ గురించి మాట్లాడనిదే నీకు పూట గడవదని అన్నారు.
పక్క దేశాలు చూడు… ప్రజలు తిరుగబడితే ఎలా కూలిపోయాయో తెలుస్తుంది. పద్ధతి భాష మార్చుకోవాలి.. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. గత ఏడాది కొన్న సన్న వడ్లు ఎన్ని.. ఇచ్చిన బోనస్ ఎంతో సమాధానం చెప్పాలి. రబీ ధాన్యం కొనుగోలు చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి సమీక్షలు చేయలేదు.  అసలు కొనుగోలు చేస్తారా లేదా తెలియదు. నీళ్లు ఇవ్వమంటే రైతుల పొలాలు వేసుకోరు.. నేడు నీళ్ళు ఇస్తామని ఇవ్వకపోవడంతో వేలాది ఎకరాలు నష్టపోయారు. ఒక తడికి ఇస్తే వేలాది ఎకరాలు పెట్టుబడి అయినా వస్తుంది.. చివరి భూముల వరకు నీళ్లు ఇవ్వాలి. ధాన్యం కొనుగోళ్లపై వెంటనే ఒక ప్రకటన చేయాలి. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ నుంచి 9000 క్యూసెక్కుల నీరును పారించామని అన్నారు.
కన్నెపల్లి పంప్ హౌస్ బాగానే ఉందని అధికారులు చెబుతున్నారు.. అయినా నడిపించే సోయి ప్రభుత్వానికి లేదు..
ఎన్డీఎస్పీ  ఒక సాకుతో కాలేశ్వరం నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారు. చంద్రబాబు నిబంధనలు తుంగలో తొక్కి నీళ్లు తీసుకుపోతుంటే ఇక్కడి ప్రభుత్వానికి సోయిలేదు. రైతులు మేలుకోవాలి.. కాళేశ్వరం కొనసాగింపుకు మరో ఉద్యమం చేయాలని అన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్