లక్షా 75 వేల ఎకరాలను తాకట్టు పెట్టే కుట్ర చేస్తున్న రేవంత్ రెడ్డి
ఎమ్మెల్పీ కవిత
హైదరాబాద్
Revanth Reddy is conspiring to mortgage 1.75 lakh acres: MLP Kavitha
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు. టీజీఐఐసీ పరిధిలో లక్షా 75 వేల ఎకరాలను తాకట్టు పెట్టే కుట్రపూరిత స్కెచ్ రేవంత్ రెడ్డి వేసారని ఆరోపించారు. నా దగ్గర నిర్ధిష్టమైన ఆధారాలు ఉన్నాయి. టీజీఐఐసీని ప్రైవేటు లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసింది. కంపెనీ హోదాను మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రుణం పొందాలన్నది ప్రభుత్వ ఆలోచన తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజిలో కుదువ పెట్టే కుట్ర జరుగుతోంది. పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోడానికి టీజీఐఐసీ ద్వారా ద్వారాలు తెరిచారు. కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజ్ లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? స్టాక్ ఎక్సేంజ్ లో నష్టం జరిగితే తెలంగాణలో జమా చేసుకున్న భూముల భవితవ్యం ఏమిటి, తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస ఆలోచన చేయకపోవడం దారుణమని అన్నారు.
టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. గత 16 నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రూ 1.8 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారని ఆమె అన్నారు.



