రేవంత్ రెడ్డి బూతుల సీఎం
Revanth Reddy is filthy words CM
మెదక్
నర్సాపూర్ నియోజకవర్గ కుల్చారంలో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జయరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి దేశపతి శ్రీనివాస్, శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, పద్మ దేవేందర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి రైతు రుణమాఫీ చేసేందుకు ఈ రైతు దీక్షను సునీత లక్ష్మారెడ్డి గారు ఏర్పాటు చేశారు. నెల రోజులు దాటిన రైతుల వడ్లను కొనడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. పంట చేతికి వచ్చిన రైతుబంధు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను చూపేందుకు ఈ రైతు దీక్ష. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఎవరు అడగకపోయినా రైతుల కోసం రైతుబంధు పెట్టింది కేసీఆర్. ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చి, రైతులకు ఐదు లక్షల రూపాయల రైతు బీమా అందించిన కేసీఆర్. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చింది మన కేసీఆర్. రైతుల పంటను గింజ లేకుండా కొన్నది మన కేసీఆర్. రైతులకు నీటి తీరువ లేకుండా చేసింది కేసీఆర్. అందుకే కెసిఆర్ ని రైతుల సీఎం అని కొనియాడారు. బూతుల సీఎంగా చరిత్రలో నిలిచాడు రేవంత్ రెడ్డి. కెసిఆర్ రైతుల సీఎం అయితే రేవంత్ రెడ్డి బూతుల సీఎం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ఆరు హామీలు అమలు చేశామని చెప్పుకుంటున్నారు. మహిళలకు 2500 రూపాయలు ఎగపెట్టింది కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల రుణమాఫీ రైతులకు చేశారా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇచ్చారా. 4000 పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చారా. అన్ని హామీలు ఎగపెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెప్పుకోవడం దుర్మార్గం. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసింది రేవంత్ రెడ్డి. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి రైతులనే కాదు దేవుళ్లను కూడా మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చినంక గ్యారెంటీకి బాండ్ పేపర్ కు విలువ లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి గ్యారెంటీ అనే పదానికి విలువ తీసింది కాంగ్రెస్ పార్టీ. ఈ సగం రుణమాఫీ కూడా బిఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే జరిగింది. డిసెంబర్ 9 అన్నరు కాలేదు, పంద్రాగస్టు కు రుణమాఫీ చేస్తారని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు కాలేదు. నిన్న పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గర తప్పైన ఒప్పుకుంటాడేమో అనుకున్నా. ఆ దేవుని దగ్గరికి పోయి మళ్లీ ప్రజలను మోసం చేసే విధంగానే ప్రవర్తించాడు. పంద్రాగస్టు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని సవాలు చేసి పూర్తి రుణమాఫీ చేయకుండా పారిపోయిండు రేవంత్ రెడ్డి. వాయిదాలు మీద వాయిదాలు పెట్టి వాయిదాల ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. హరీష్ రావు మూసి పాదయాత్ర చేయమని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. మూసిల ఇండ్లు కూలగొట్టింది ఎక్కడ, నువ్వు పాదయాత్ర చేసింది ఎక్కడ. ఎక్కడైతే మూసిలో ఇల్లు కూలగొట్టావు అక్కడ నుంచి పాదయాత్ర చేద్దాం రా రేవంత్ రెడ్డి. 66 ఏండ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పుణ్యమే మూసి కాలుష్యం. 3800 కోట్లు ఖర్చుపెట్టి మూసి పునర్జీవం ప్రారంభించారు కేసీఆర్.కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో పుణ్యమే నల్గొండ ఫ్లోరోసిస్.ఆంధ్ర బాబుల బ్యాగులు మోసిన రేవంత్ రెడ్డికి కెసిఆర్, తెలంగాణ విలువ ఏం తెలుసని అన్నారు.
ఈ రాష్ట్రాన్ని ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దింది కేసీఆర్. ఎక్కడైతే ఇండ్లు కూల కొట్టావో, ఎక్కడైతే ప్రజల కడుపు మంట ఉందో అక్కడ నుంచే మూసి పాదయాత్ర ప్రారంభిద్దాం. రుణమాఫీ ఎగ్గొట్టినవు, రైతుబంధు ఎగ్గొట్టినవ్, బతుకమ్మ ఎగ్గొట్టినవ్, కెసిఆర్ కిట్టె ఎగ్గొట్టినవ్, కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ ఎగ్గొట్టినవ్. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగవు. రేవంత్ రెడ్డి తిట్లకు ఈ గులాబీ జెండాలు భయపడవు. రేవంత్ రెడ్డి తిట్లు, కేసిఆర్ ది కిట్లు.కెసిఆర్ రెండుసార్లు రైతుబంధు ఇస్తున్నాడు మూడుసార్లు రైతుబంధు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు ఉన్న రైతుబంధు ఎగపెట్టిండు రేవంత్ రెడ్డి. మూసి మురికి కంటే రేవంత్ రెడ్డి మాటలే ఎక్కువ కంపు..మాటలు కాదు చేతలు చేసి చూపించు రేవంత్ రెడ్డి. సినిమాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు. రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే రాజకీయాల్లో కూడా ఏ సర్టిఫికెట్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ నాయకులకు కూడా సెన్సార్ బోర్డు ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి తెలివి ఎంత అంటే హైదరాబాద్కు మూడు దిక్కుల సముద్రం ఉందంట. బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందంట. దిల్ సుఖనగర్ లో విమానాల అమ్ముతరట. నోరు తెరిస్తే అబద్దాలు తప్ప ఈ ముఖ్యమంత్రి కి ఏమి రావు. కొండా లక్ష్మణ్ బాపూజీ నల్గొండ లో పుట్టిండని రేవంత్ రెడ్డి అంటున్నాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ పుట్టింది అదిలాబాదులో. ఈ ముఖ్యమంత్రి నోటికొచ్చిన అబద్ధాన్ని చెబుతూ ముఖ్యమంత్రి కూర్చి విలువ దిగజార్చుండు.
తెలంగాణలో 30% వడ్లు దళారుల పాలయ్యాయి. ప్రభుత్వం ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదని రైతులు దళారులకు 1700లకు అమ్ముకుంటున్నారు.
2300 మద్దతు ధర, 500 బోనస్ కలిపి 2800 రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి చేతగాని ప్రభుత్వం వల్ల వెయ్యి రూపాయలు రైతు నష్టపోతున్నాడు.మిగిలిన వడ్లనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కొని రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వాలి. కచ్చితంగా రైతు భరోసా వానకాలం యాసంగి కలిపి 15000 రూపాయలు ఇవ్వాల్సిందే.ఇచ్చేదాకా బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది. రైతులు కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ ప్రశ్నించండి.
ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రకు పోతే డిప్యూటీ సీఎం మరో ప్రత్యేక విమానంలో జార్ఖండ్ వెళ్లారట, ఇంకో మంత్రి సీతక్క కేరళకు వెళ్లారట, మరో మంత్రి శ్రీధర్ బాబు మలేషియాకి వెళ్లారట. గాలి మోటర్లు జల్సాల్ చేస్తుంటే ప్రజలేమో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు గాలి మోటర్ లో తిరిగి రైతులను ప్రజలను గాలికి వదిలేశారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇప్పుడు మహారాష్ట్రలోనూ గారడీ గ్యారంటీలు. కాంగ్రెస్ గారడీల గ్యారెంటీ ల గురించి తెలిసే హర్యానాలో కాంగ్రెస్ను ఓడించారు ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి వస్తుంది. మహారాష్ట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో రైతుల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చామని చెప్తున్నారు. మనలాగే మహారాష్ట్ర ప్రజలు మోసపోవద్దంటే మనం కూడా మహారాష్ట్రలో ఉన్న మన బంధువులకు కాంగ్రెస్ పార్టీ మోసాన్ని చెప్పాలి. కలెక్టర్ల కాళ్ళ మీద రైతులు పడే దుస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈనెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు జరపాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారంట. రుణమాఫీ చేయనందుకు విజయ ఉత్సవమా. రైతుబంధు ఎగ కొట్టినందుకు విజయోత్సవమా. మహిళలకు 2500 ఎగ్గొట్టినందుకు విజయ ఉత్సవమా. ఒక్క ఇల్లు ఇవ్వకుండా ఉన్న ఇల్లు కొట్టినందుకు విజయ ఉత్సవాలా అని ప్రశ్నించారు.