15.1 C
New York
Wednesday, April 24, 2024

రేవంత్‌ రెడ్డి..లీక్‌ వీరుడు కాదు.. గ్రీక్‌వీరుఢ

- Advertisement -

హైదరాబాద్‌: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిందని సీరియస్‌ కామెంట్స్‌ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌.

అలాగే, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు.

కాగా, ఎంపీ లక్ష్మణ్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ..’గత ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడితే.. సందట్లో సడేమియా అన్నట్టుగా అధికారులు సర్దుకున్నారు. గత ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కును గత ప్రబుత​ం అణచివేసింది. తెలంగాణను అబాసుపాలు చేసింది. పోలీసుల అనుమతితో ఒకటి రెండు ఫోన్‌ ట్యాపింగ్‌లు జరగవచ్చని కేటీఆర్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.

ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్‌ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి. వ్యాపారులను బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించుకోవాలి. లీక్‌ వీరుడు కాదు.. గ్రీక్‌వీరుడైతే సీబీఐ విచారణకు వెంటనే ఆదేశించాలి. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంది. కేసీఆర్‌ కుటుంబాన్ని శిక్షించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!