- Advertisement -
రేవంత్ సారు నా భూమిని ఇప్పించండి
Revanth sir give me my land
-నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం ఇరికిగూడెం గ్రామానికి చెందిన వృద్ధురాలు సావిత్రమ్మ మొర
హైదరాబాద్
మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకుతోపాటు కుటుంబ, ఆర్థిక కష్టాలలో నలిగిపోతున్న తనకు చెందిన భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించి తనకు న్యాయం చేయాలంటూ 84 ఏళ్ల వృద్ధురాలు సావిత్రమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించింది.
తన తల్లి లచ్చమ్మ నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని ప్రస్తుతం కాంగ్రెస్ నేతలుగా చలామణి అవుతున్న వారు నకిలీ పత్రాలతో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నల్లగొండ జిల్లా మంత్రి కి మొరపెట్టుకున్న ప్రయోజనం లేకుండా పోయిందని తనకు న్యాయం చేయాలంటూ విలపించింది.
- Advertisement -