- Advertisement -
అర్ధం కానీ రేవంత్ వ్యూహం
Revanth's strategy are not understandable
హైదరాబాద్, నవంబర్ 2, (వాయిస్ టుడే)
మరో ఏడాదిలో కేసీఆర్ పేరు ఎక్కడా వినపడకుండా చేస్తా. కేటీఆర్‌తోనే కేసీఆర్‌ను బయటకు రాకుండా చేస్తా. తర్వాత కేటీఆర్, హరీష్ పోటీలో కేటీఆర్ కనిపించకుండా పోతాడు. హరీష్ ను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు “… ఈ కామెంట్స్ అన్నీ సీఎం రేవంత్ రెడ్డివి. ఆయన ఎక్కడ అన్నారు అంటే ఆధారాలు ఉండవు. ఎందుకంటే ఆఫ్ ది రికార్డుగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇష్టాగోష్టి మాటలు. మీడియా ప్రతినిధులతో మాట్లాడితే ఆటోమేటిక్ గామీడియాలో వస్తాయి. వచ్చాయి కూడా. ఈ మాటలు విన్న తర్వాత బీఆర్ఎస్ నేతలకు బీపీ రాకుండా ఉంటుందా ?. వచ్చింది కూడా. చాలా మంది వచ్చి ..కేసీఆర్ పేరును లేకుండా ఎవరూ చేయలేరని ప్రకటించారు.రేవంత్ రెడ్డి ఇలాంటి చిట్ చాట్‌లలో చాలా సార్లు సీరియస్ కామెంట్స్ చేశారు. అన్నీ రాజకీయపరమైనవే. వాటిపై బీఆర్ఎస్ నేతలు ఆవేశపడుతూంటారు. వివాదం అయినప్పుడు అసల రేవంత్ ఎక్కడ ఆ మాటలు అన్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తే బీఆర్ఎస్ వద్ద సమాధానం ఉండదు. అందుకే హరీష్ రావు చాలా సార్లు రేవంత్ రెడ్డి చిట్ చాట్లలో చేస్తున్న వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజానికి రేవంత్ రెడ్డి ఇలాంటి పొలిటికల్ చిట్ చాట్‌లను తన రాజకీయ వ్యూహాల కోసం వినియోగించుకుంటారని అనుకోవచ్చు. కీలకమైన వ్యాఖ్యలు చేసి వాటి మీద వచ్చే రెస్పాన్స్ అంచనా వేసుకుంటారని..దానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లోనే ఉంటున్నారు. కేటీఆర్‌కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఆయనకు తోడు హరీష్ రావు ఉంటున్నారు. అయితే కేసీఆర్ బయటకు రావాలని రేవంత్ కోరుకుంటున్నారు. గతంలో అనేక సార్లు సవాళ్లు చేశారు. అసెంబ్లీకి రావాలని పిలుపునిచ్చారు. ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తామని చెప్పారు. కేసీఆర్ బయటకు రాలేదని చాలా సార్లు సీరియస్ కామెంట్లు చేశారు. ఇప్పటికీ కేసీఆర్ బయటకు వచ్చి తనతో పోటీగా రాజకీయాలు చేయాలని రేవంత్ అనుకుంటున్నారు.అందుకే ఎప్పటికప్పుడు కేసీఆర్ ను .. బీఆర్ఎస్ ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. తమకు సమ ఉజ్జి కేటీఆర్ ఏ మాత్రం కాదని కేసీఆర్ అనే అనుకుంటున్నారని ఆయన వస్తేనే రాజకీయంగా తన శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో బయట పెట్టుకోవచ్చని రేవంత్ అనుకుంటున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే రేవంత్ మాటలపై బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు కానీ..కేసీఆర్ వైపు నుంచి స్పందన రావడం లేదు. కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసినప్పటి నుంచి ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. కనీసం పార్టీ కార్యక్రమాల గురించి పట్టించుకోవడం లేదు. ఎవరైనా పార్టీ నేతలు పుట్టిన రోజు లేదా మరో సందర్భంగా ఆశీర్వాదం కావాలని అడిగే ఒకటి, రెండు నిమిషాలు ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తున్నారు కానీ రాజకీయాలు మాట్లాడటం లేదు. కేటీఆర్, హరీష్ రావులకు అయినా దిశా నిర్దేశం చేస్తున్నారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. రేవంత్ చిట్ చాట్లలో చేస్తున్న కామెంట్స్ పూర్తిగా కేసీఆర్ ను మళ్లీ బయటకు తీసుకు వచ్చే వ్యూహమే అయితే.. బీఆర్ఎస్ ఆ ట్రాప్‌లో పడలేదని అనుకోవచ్చు.
- Advertisement -