అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు,ఎటపాక పోలీస్ స్టేషన్ లో ఎస్పీ ఎదుట జన జీవన్ స్రవంతిలో కలిసిపోయారు
అల్లూరి జిల్లా ఎటపాక పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు, గొత్తి కోయ తెగకు చెందిన సిపిఐ మావోయిస్టు సాతగాన్ ఏరియా కమిటీ సభ్యురాలు సున్నం నీల,ముడివి మధు అనే చత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా కు చెందిన ఇద్దరు మావోయిస్టులు ఎటపాకల పోలీసుల ఎదుట లొంగిపోయారు,సున్నం నీల 6 కీలక ఘటనల్లో పాల్గొని పలువురు భద్రత సిబ్బంది మరణాలను కీలక పాత్ర పోషించింది, ఈమెపై 4 లక్షల వరకు రివార్డు కూడా ఉంది ,ఈమె లొంగిపోయిన కారణంగా ఆమెపై ఉన్న 4 లక్షల రివార్డులు అలాగే మధు పై ఉన్న లక్ష రూపాయల రివార్డులు కూడా వారికే ఇవ్వడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ తెలిపారు,

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, అల్లూరి జిల్లాలో పోలీసులు నిర్వహిస్తున్న పరివర్తన కార్యక్రమలు సత్ఫలితాలు ఇస్తున్నామని అన్నారు, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలతో పోలీసులు గిరిజనులకు చేరువవుతున్నారని అన్నారు,స్ఫూర్తి అనే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలో గిరిజన యువతికి ఉపాధి అవకాశాలు కల్పించామని అన్నారు,ఇంకా ఎవరైనా అడవి బాటలో ఉన్న తమ్ముళ్లు జనజీవన స్రవంతి లోకి రావాలని అలాంటి వారికి పోలీసులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు



