- Advertisement -
మార్చి 2న ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదల
వ్యూహం సినిమాకు తొలగిన సెన్సార్ అడ్డంకులు
హైదరాబాద్
రాం గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం సినిమా మార్చి 2విడుదల కానుంది. ఆ సినిమాకు సెన్సార్ అడ్డంకులు తొలగిపోయాయి. టీడీపీ అభ్యంతరాలతో 3 సార్లు సెన్సార్ కు వ్యూహం వెళ్ళింది. సినిమాలో 22 చోట్ల మ్యూట్ లు, రెండు సన్నివేశాల తొలగించారు. సినిమాలో పాత్రలకు పెట్టిన చంద్రబాబు, పవన్, జగన్ పేర్లను సెన్సార్ బోర్డు మార్పించింది. జగన్ రాజకీయ జీవితాన్ని వ్యూహం పేరుతో ఆర్జీవీ తెరకెక్కించారు. ఇప్పటికే వ్యూహం సినిమా విడుదల రెండుసార్లు వాయిదా పడింది.
- Advertisement -