- Advertisement -
అల్పపీడన ప్రకటనతో వరి రైతుల ఆందోళన..
Rice farmers are worried about the announcement wheather
నందిగామ
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో ఒక మాదిరి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో వరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి కోతకు వచ్చినప్పటికీ యంత్రాల కొరత ఏర్పడడంతో చాలా వరి పొలాలు పంట పొలాలలో అంతే ఉన్నాయి మరి కొందరు వరి పొలాలు కోసినప్పటికీ వడ్లు ఎండడానికి కల్లాలలో పోసి ఉన్నారు. కనీసం కల్లాలలో పది రోజులు పాటు ధాన్యం ఉండాల్సి ఉన్నది అందువలన వర్షాలు కురిస్తే కోసిన పంట చేతికి రాదేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలానే ఇప్పటికి కోయని వరి పొలాలు పండిన పంట చేతికి అందదేమోనని పెట్టిన పెట్టుబడులు సైతం వచ్చే అవకాశాలు ఉండవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అల్పపీడనం వలన వర్షాలు కురిస్తే ఉభయ కృష్ణ జిల్లాల్లో వరి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
- Advertisement -